అసలైన ఎండ ముందుంది.. జాగ్రత్త!

Tuesday, April 17th, 2018, 12:43:09 AM IST

రోజు రోజుకి తెలుగు రాష్ట్రాల్లో ఎండా తీవ్రత చాలా ఎక్కువవుతోంది. తెలంగాణాలో నిన్న మొన్న బాగానే ఉన్నా సూర్యుడు దోబూచు లాడుతుండడంతో తెలియకుండానే సెగలను రప్పిస్తున్నాడు. వేడి గాలుల తీవ్రత ఎక్కువవుతోంది. ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని నగరాల్లో అయితే పరిస్థితి మరి దారుణంగా కనిపిస్తోంది. చల్లగా ఉంది అనుకునే లోపే సడన్ సూర్యుడు ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. విజయవాడలో నేటి ఉదయం ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు చేరింది అంటే పరిస్థితి ఏ లెవెల్లో ఉందొ అర్ధం చేసుకోవచ్చు. ఏప్రిల్ ఆరంభంలోనే ఇలా ఉందంటే మే నడిమధ్యలో ఇంకెంత దారుణంగా ఎండలు చుక్కలు చూపిస్తాయో అని జనాలు మాట్లాడుకుంటున్నారు.

అత్యధిక ఉష్ణోగ్రతలకు తోడు వడగాల్పులు కూడా మనిషిని దెబ్బకొట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ఆ తీవ్రత పెరుగుతుండటంతో అడుగు ఇంటి నుంచి బయపెట్టాలంటే వణికిపోతున్నారు. దీంతో కొన్ని ప్రధాన నగరాల్లో రహదారులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా భయపెట్టే విధంగా ఉన్నాయి. ఎండలు రానున్న రోజుల్లో చాలా గట్టిగా ఉన్నాయి అనే విధంగా సమాధానం ఇస్తున్నారు. దీంతో జనాలు సమ్మర్ లో అవుట్ డోర్ పనులకు పెట్టుకోకూడదని ప్లాన్స్ వేసుకుంటున్నారు. మరి సూర్యుడు ఎంతవరకు తన ప్రతాపాన్ని చూపిస్తాడో చూడాలి.