చంద్రబాబుకు గుడి కట్టేస్తున్నారు..!

Tuesday, January 23rd, 2018, 11:55:48 PM IST

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ గుడి కట్టేయనున్నారు. అందులో ఏకంగా చంద్రబాబు వెండి విగ్రహాన్ని ప్రతిష్టిస్తారట. ఇంతకీ చంద్రబాబుని దేవుడిలా భావిస్తున్నది ఎవరంటే నంద్యాల ప్రాంతానికి చెందిన హిజ్రాలు. ఏపీ ప్రభుత్వం వారిని కూడా మనుషులు లాగే గుర్తించి రేషన్, పింఛన్లు అందిస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు తమ పట్ల మానవతావాదంతో ఆదరించారని హిజ్రాలు అంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వం హిజ్రాలకు సంక్షేమ పథకాల్ని కూడా ప్రారంభించింది.

చదువుకున్న హిజ్రాలు వ్యాపారం చేసుకునేలా రుణాలు ఇప్పించనున్నారు. హిజ్రాల కోసం సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేశారు. ప్రతినెలా వారికి రూ 1500 పింఛను అందించనున్నారు. చంద్రబాబు తమని మనుషులుగా గుర్తించారని, అందుకే ఆయనకు గుడి నిర్మిస్తామని అన్నారు. నంద్యాల నుంచి మహా నంది వెళ్ళేదారిలో చంద్రబాబుకు ఆలయం నిర్మించనున్నట్లు తెలిపారు.