ఆస్ట్రేలియా వీసా.. ఎందుకు ఈ నస?

Saturday, March 24th, 2018, 06:05:13 PM IST

వీసా కావాలంటే ఈ రోజుల్లో చాలా కష్టతరమైపోయింది. ముఖ్యంగా అగ్ర రాజ్యాలు వీసాల విధానాలలో మార్పులు తేవడం ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. ప్రస్తుతం అమెరికా హెచ్ 1బి వీసాల్లో చేస్తోన్న మార్పులు భారతీయ సాఫ్ట్ వేర్ కంపెనీలకు ఎఫెక్ట్ పడుతోంది. భారత యువత కూడా వీసా విధానాల కారణంగా అమెరికాకు వెళ్లడం కష్టమవుతోంది. మొత్తంగా ట్రంప్ స్వదేశీయులకు ముందు ఉద్యోగాలు ఇవ్వాలనే విధంగా చర్యలు తీసుకుంటున్నాడు. అయితే ఇప్పుడు ఆస్ట్రేలియా కూడా అదే బాట పట్టింది. విదేశీ నైపుణ్య ఉద్యోగాలకు ముఖ్యమైన వీసాలను రద్దు చేసి కొత్త తరహా విధానాన్ని ప్రవేశపెట్టింది.

అతి ముఖ్యమైన సబ్‌క్లాజ్‌ 457 కేటగిరికి చెందిన వీసాలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు చెప్పింది. ఈ విధానం వలన విదేశీయులకు ఎఫెక్ట్ పడకుండా ఉండదు. ముఖ్యంగా భారత విద్యార్థుల ఆశలు గాలిలో కలిసిపోవాల్సిందే. ప్రస్తుతం టీఎస్‌ఎస్‌ అనే వీసా అందుబాటులో ఉంచరు. టెంపరరీ స్కిల్‌ షార్టేజి అనే ఈ వీసాను మార్చ్ 18న అమలు చేశారు. ఇందులో ఉన్న కఠిన నిర్ణయాలు చాలా వరకు ఊహించని విధంగా ఉన్నాయి. ఆస్ట్రేలియాలో ఉండాలనుకునే వారికి టీఎస్‌ఎస్‌ వీసా విధానం పెద్ద తలనొప్పే.
ఎందుకంటే టెంపరరీ స్కిల్‌ షార్టేజి వీసా ( టీఎస్‌ఎస్‌) నిబంధనలు ఆ విధంగా ఉన్నాయి మరి. కచ్చితంగా ఆంగ్లభాషలో ప్రావీణ్యంతో పాటు రెండేళ్ల అనుభవం ఉండాలి. నేర చరిత్రను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. మార్కెట్ జీతాలు ఆస్ట్రేలియన్లకు అనుకూలంగా ఉండాలి.

విదేశీ నిపుణులను తెచ్చుకోవాలంటే.. అక్కడి కంపెనీలపై తీవ్ర ఆర్థిక భారం పడుతుంది. ప్రతి ఉద్యోగిపైనా అక్కడ ఉండడానికి ఎస్‌ఏఎఫ్‌ పన్ను చెల్లించాలి. ఏడాదికి 1200 డాలర్లు. అంటే ఇండియన్ కరెన్సీలో 78వేలు చెల్లించాలి. ఈ తరహాలో పన్ను కట్టుకుంటూ పోతే సంస్థలు చాలా నష్టపోవాల్సి వస్తుంది. నాలుగేళ్లకు సుమారు రూ. 3.12 లక్షల పన్ను కట్టాలి. ఇంతకుముందు 400కు పైగా ఉద్యోగాలు వచ్చే విదేశీయులకు ఇప్పుడు కేవలం 200 మాత్రేమే వచ్చే అవకాశం ఉంది.

  •  
  •  
  •  
  •  

Comments