ఫిల్మ్ ఛాంబర్ వద్ద ఉద్రిక్తత

Friday, October 24th, 2014, 12:06:22 PM IST

rama-krishna-goud
హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. గత ఏడు రోజులుగా తెలంగాణ ప్రొడ్యూసర్ గిల్డ్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. సినిమా దియోటర్ల లీజు విధానం రద్దు చేయాలని కోరుతూ రామకృష్ణ గౌడ్ గత ఏడు రోజులుగా దీక్ష చేస్తున్నారు. దియోటర్ల లీజును రద్దు చేయడంతో పాటు.. ఫిల్మ్ చాంబర్ కు వెంటనే ఎన్నికలు నిర్వహించాలని… దీక్ష చేస్తున్నారు. దియోటర్ల గుప్తాదిపత్యంపై నాలుగు సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నామని ఆయన తెలిపారు. ఏడు రోజులుగా దీక్ష చేస్తున్నప్పటికీ చాంబర్స్ అధికారులు పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు.
తెలంగాణ ప్రభుత్వం తలుచుకుంటే..సమస్య పరిష్కారం అవుతుందని.. ఆయన తెలిపారు. కాగ, ఈరోజు రామకృష్ణ గౌడ్ మద్దతుదారులు.. ఫిల్మ్ ఛాంబర్ అద్దాలు పగలగొట్టడంతో ఛాంబర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే.. తాజా సమాచారం ప్రకారం తెలంగాణ ప్రొడ్యూసర్ గిల్డ్ ప్రెసిడెంట్ రామకృష్ణ గౌడ్ దీక్ష విరమించినత్తు తెలుస్తున్నది.