మోదీ హత్య కుట్ర భగ్నం !

Tuesday, November 29th, 2016, 08:34:32 AM IST

modi1
ప్రధాని మోదీతో పాటు మరికొందరు ముఖ్య నేతల హత్యకు, దౌత్య కార్యాలయాల పేలుళ్లకు చేసిన కుట్రను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ భగ్నం చేసింది. అంతేగాక వ్యాహా రచన చేస్తున్నట్టు బలమైన అనుమానాలున్న నలుగురిని అరెస్టు తమిళనాడులో అరెస్టు చేసింది. వివరాల్లోకి వెళితే మధురైలో ఆదివారం రాత్రి అయూబ్ ఖాన్, అబ్బాస్ అలీ, అబ్దుల్ కరీం, దావూద్ సులేమాన్ లు నలుగురు కలిసి చిత్తూరు, కర్ణాటక, మైసూర్ లలో కోర్టు పేలుళ్లలో వీరు నలుగురు ప్రధాన సూత్రదారులని అనుమానిస్తున్నారు.

అలాగే వీరి వద్ద నుండి భారీ స్థాయిలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే ఈ ఆపరేషన్లో ప్రధాన టార్గెట్ అయినా గ్యాంగ్ లీడర్ హకీమ్ తృటిలో తప్పించుకున్నాడు. దీంతో దొరికిన నలుగురిని ఎన్ఐఏ కార్యాలయంలో విచారిస్తున్నారు. ఈ విచారణలో వీరంతా ఐఎస్ఐ సానుభూతిపరులని ‘ద బేస్ మూమెంట్’ పేరుతో పేలుళ్లు జరుపుతూ భవిష్యత్తులో మోదీ లాంటి ప్రధాన నాయకుల్ని టార్గెట్ చేసుకుని పనిచేస్తున్నారని తేలింది.