ఫాన్స్ కి షాక్ ఇచ్చిన తలైవా!

Sunday, July 22nd, 2018, 07:13:28 PM IST

తమిళ రాజకీయాలు రాబోయే ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నకొద్దీ రోజురోజుకు మరింత వేడెక్కుతానున్నాయి. దానికి ప్రధాన కారణం అక్కడి సినీ సూపర్ స్టార్లు రజినీకాంత్ మరియు కమల్ హాసన్ లు విదివిడిగా పార్టీలు నెలకొల్పడమే. ఇప్పటికే లోక నాయకుడు కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యం పేరుతో తన రాజకీయ పార్టీని ప్రారంభించి, అప్పుడే తొలివిడత ప్రజల్లోకి యాత్రతో వెళ్లి వచ్చారు. ఇకపోతే రజిని గత డిసెంబర్ 31న తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన తలైవా రజినీకాంత్, ప్రస్తుతం తన పార్టీ ప్రారంభ కార్యకలాపాల్లో నిమగ్నమై వున్నారు. అంతేకాదు తమపార్టీలోకి కనీసం కోటిన్నర మంది పార్టీ సభ్యత్వం తీసుకునేలా చేయాలనేదే తమ అభిలాష అని ఆయన పార్టీ అధికార ప్రతినిధులు తెలుపుతున్నారు. అయితే ఇప్పటికే రజిని పార్టీ ప్రకటించగానే చేరడానికి వేలాది సిద్ధంగా ఉన్నట్లు సమాచారం అందుతోంది.

ప్రస్తుతం ఒక ప్రముఖ వెబ్ సైట్ ప్రచురించిన కథనం ప్రకారం రాబోయే ఎన్నికల్లో తన పార్టీ నుండి అభిమానులు గా వున్న అభిమాన సంఘాల ప్రెసిడెంట్లు, ఫాన్స్ కమిటీ చైర్మన్లు ఎవరు కూడా టిక్కెట్లు ఆశించవద్దని రజిని ఇటీవల అభిమానులతో జరిగిన ఒక సమావేశంలో కోరినట్లు తెలుస్తోంది. ఈ విషయమై కొందరు అభిమానులు అసంతృప్తితో వున్నారని అంటున్నారు. కాగా ఈ విషమై మాట్లాడిన రజిని పార్టీ ప్రతినిధులు మాత్రం ఇంకా అప్పుడే ఎవరెవరికి టిక్కెట్లు ఇవ్వాలి అనే దానిపై క్లారిటీ రాలేదని, త్వరలోనే రజినికాంత్ ఆ విషయాలను ప్రకటిస్తారని, అభిమానులకు టికెట్ లు ఇవ్వరు అని పక్కాగా ఎక్కడ చెప్పలేదని అంటున్నారు. కాగా ప్రస్తుతం రజినీకాంత్ 2.0లో నటిస్తుండగా. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో అయన చేయబోయే చిత్రం త్వరలో ప్రారంభం కానుంది….

  •  
  •  
  •  
  •  

Comments