విజయ్ దేవరకొండకు మొన్న బన్నీ ఫ్యాన్స్ ఇప్పుడు బన్నీ..!?

Tuesday, November 20th, 2018, 02:10:56 AM IST


టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ యొక్క తాజా సినిమా “టాక్సీవాలా” చిత్రం ఇటీవలే విడుదలయ్యి అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే.అయితే విడుదలకు ముందే పైరసీ అయిన ఈ చిత్రంకి పలువురు టాలీవుడ్ సెలెబ్రెటీల నుంచి చాలా సపోర్ట్ దక్కింది.అయితే ఈ సినిమాకి మరియు ఈ చిత్ర యూనిట్ కు మాత్రం టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు అతని అభిమానులు ముందు నుంచి బాగా సపోర్ట్ గా నిలిచారు అన్నది కూడా వాస్తవం.

అయితే ఈ చిత్రం ఇంతటి ఘన విజయం సాధించినందుకు తాజాగా బన్నీ విజయ్ కు మరియు అతని చిత్ర యూనిట్ కు ఒక పెద్ద పార్టీయే ఇచ్చినట్టు తెలుస్తుంది.టాక్సీవాలా చిత్రం విడుదల సమయంలో బన్నీ అభిమానులు,విజయం తర్వాత బన్నీ ఈ చిత్రానికి ఇంత సపోర్ట్ ఇవ్వడం చర్చనీయాంశం అయ్యింది.అయితే బన్నీ అభిమానులు మాత్రం తమ అభిమాన హీరో ప్లాపుల్లో ఉన్నా సరే ఇతర హీరోలు ఎప్పుడు బాగుండాలని కోరుకుంటున్నాడు బన్నీ ఈస్ గ్రేట్ అంటున్నారు.తాను ప్రస్తుతం ప్లాప్ లో ఉన్నా సరే ఇతర హీరోల సినిమాలు బాగా ఆడాలని కోరుకుంటూ బన్నీ నిజంగానే గ్రేట్ అనిపించుకున్నారు.