ఆ నిర్ణయం అధిష్టానానిదే : ఎంపీ కవిత కీలక ప్రకటన

Friday, April 27th, 2018, 04:07:56 PM IST

తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడి 17 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా నేడు ఆ పార్టీ నేతలు హైదరాబాద్ కొంపల్లిలో ప్లీనరీ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఒక వైపు ప్లీనరి జరుగుతుండగా మరొకవైపు టిఆర్ ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఒక కీలక ప్రకటన చేశారు. గత కొద్దిరోజులుగా టిఆర్ ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుదిశగా జాతీయ చూస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆమె గత కొద్దిరోజులుగా తన పార్లమెంట్ స్థానంలోని జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో విరివిగా పర్యటనలు చేస్తుండడంతో ఆమె రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జగిత్యాల అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేస్తారేమో అనే ఊహాగానాలు వినిపించాయి.

అదీ కాకా కేసీఆర్ జాతీయ రాజకీయాల మీద దృష్టిపెట్టడంతో ఇకపై రానున్న రోజుల్లో ఆయన తనయుడు కేటీఆర్ కానీ, కుమార్తె కవిత కానీ అయన స్థానంలో ఉంటారని అంటున్నారు. అయితే విషయమై నేడు పార్టీ కార్యాలయంలో కవిత మాట్లాడుతూ నేను రానున్న 2019 ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తానో లేక ఎమ్యెల్యేగా పోటీచేస్తానో అనేది చెప్పలేను. ఎందుకంటే ఆ నిర్ణయం తీసుకునే పూర్తి హక్కు అధిష్టానానిదే అని ఆమె అన్నారు. అధిష్టానం నిర్ణనయం తనకు శిరోధార్యమని, తాను వారు ఆ సమయంలో వారు చెప్పినట్లు నడుచుకుంటాను అని స్పష్టం చేశారు……

  •  
  •  
  •  
  •  

Comments