ఆ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతారట!

Monday, April 30th, 2018, 02:52:35 PM IST

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి పేరు తెలియని, పలకని తెలుగువారుండరు, అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి అవసరంలేదు. అయితే ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ పార్టీ ని నేడు అధినేత స్థానంలో చంద్ర బాబు నాయుడు నడిపిస్తున్నారు. ఎన్టీఆర్ కు టిడిపిలో వున్న పేరు నేడు చంద్రబాబుకి ఉన్నప్పటికీ ఎన్టీఆర్ చరిష్మా, పేరుప్రఖ్యాతలు ఎవరితోనూ పోల్చలేనివి. ఎన్టీఆర్ మరణాంతరం ఆయనకు భారత రత్న ఇవ్వాలని గత కొన్ని సంవత్సరాలుగా పోరాటం జరుగుతున్న విషయం తెలిసిందే. కేంద్రం లో ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ, ఆయనకు మాత్రం భారతరత్న దక్కలేదు.

కాగా నేడు వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఎన్టీఆర్ కు తన వంతు నివాళి అందించేలా ఒక అరుదైన నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.1900 కిలోమీటర్లు పూర్తిచేసుకుని, తాను కొనసాగిస్తున్న ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ప్రస్తుతం కృష్ణ జిల్లా, ఎన్టీఆర్ జన్మస్థలి నిమ్మకూరులో ఆయన పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ, తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కృష్ణా జిల్లాకు నందమూరి తారక రామారావు జిల్లా గా నామకరరాణం చేస్తాం అని, అది మనం ఆ మహానుభవుడికి ఇచ్చే అరుదైన గౌరవమని అన్నారు. తెలుగు వారు గర్వించతగ్గ మహా నటుడు, మహనీయుడు ఎన్టీఆర్ అని జగన్ ఆయనపై పొగడ్తల జల్లు కురిపించారు.

ఆయనపేరుతో టిడిపి గద్దెనెక్కిన చంద్రబాబు, ఆయన పేరును వాడుకోవడమే తప్ప ఎన్టీఆర్ కు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వడం లేదని విమర్శించారు. కాగా అక్కడి ప్రజలు కొందరు నిమ్మకూరులో చెరువు తవ్వకాన్ని మొదలుపెట్టారని, అయితే ఆ తవ్వకం సమయంలో వచ్చిన మట్టిని ఇక్కడి టీడీపీ నేతలు అధిక ధరలకు అమ్ముకుంటున్నారని ఫిర్యాదు చేసారు. అయితే తమ ప్రభుత్వం అధికారం లోకి వస్తే ఇటువంటి అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేస్తామని, అక్కడిప్రజలకు జగన్ హామీ ఇచ్చారు……

  •  
  •  
  •  
  •  

Comments