జగన్ పార్టీలోకి ఆ మాజీలు?

Tuesday, April 24th, 2018, 08:40:47 AM IST

వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం ప్రజా సంకల్ప యాత్రతో ముందుకు సాగిపోతున్నారు. యాత్రలో భాగంగా ఎక్కడికక్కడ చంద్రబాబు ప్రభుత్వం వైఫలయలను ఎండగడుతూ ఆయన పార్టీ అవలంబిస్తున్న విధానాలపై విమర్శలు చేస్తున్నారు. ఈ యాత్ర చేపట్టాక వైసిపి నేతల్లో ఉత్సాహం పెల్లుబికుతోంది. దానికి ప్రధాన కారణం జగన్ కు ప్రతి చోట జనం నీరాజనాలు పడుతున్నారు. అంతే కాదు ఈ యాత్ర తర్వాత కొందరు సీనియర్లు కూడా పార్టీలో చేరుతున్నారు. అయితే ఇదే విధంగా మరికొందరు కాంగ్రెస్ మాజీ నేతలు వైసిపిలో చేరే సూచనలు కనిపిస్తున్నట్లు వినికిడి.

ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి వున్నపుడు ఆయనకు వెన్నుదన్నుగా నిలిచిన చాలా మంది కాంగ్రెస్ మాజీలు ఆయన మరణానంతరం వైసిపి లో మాత్రం చేరలేదు. అందులో ముక్యులు గా చెప్పుకోవలసింది గుంటూరు కు చెందిన కన్నా లక్ష్మి నారాయణ. కన్నా ప్రస్తుతం బిజెపి లో చేరారు. అయితే ఆయన ఆ పార్టీలో చేరినప్పటినుండి ఏమంత ఆసక్తితో లేరని సమాచారం. నిజానికి సంఘ్ బ్యాక్ గ్రౌండ్ వున్నవారికి మాత్రమే ఆ పార్టీలో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు తప్ప మిగిలిన వారికీ కాదనేది రుజువవుతోంది అంటున్నారు. అలానే మరొక నేత నెల్లూరుకు చెందిన ఆయన రామ్ నారాయణరెడ్డి. నిజానికి ఆనం సోదరులు వైఎస్ కు మంచి వెన్ను దన్నుగా ఉండేవారు. కాంగ్రెస్ నుండి బయటకి వచ్చాక వారు టిడిపి లో చేరారు.

అయితే ప్రస్తుతం వారు కూడా టీడీపీ పై నిరాసక్తతతో ఉన్నట్లు తెలుస్తోంది. మరో వైపు ఆనం సోదరుడు వివేకానంద రెడ్డి ఆరోగ్యం బాలేకపోవడంతో ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఆయనను చంద్రబాబు ఏదో తూ తూ మంత్రంగా వచ్చి పరామర్శించారు తప్ప పెద్దగా శ్రద్ధ కనబరచలేదని సమాచారం. అయితే ఈ ఇద్దరు నేతలు చూపు ప్రస్తుతం వైసిపి మీద ఉందని. జగన్ ఒప్పుకుంటే అవకాశాన్ని బట్టి వీరు త్వరలో ఆ పార్టీలో చేరే అవకాశం కనపడుతోందని సమాచారం. అయితే ప్రస్తుతానికి యాత్రలో బిజీగా వున్న జగన్ ఇటువంటి నేతలు తిరిగి తమ పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తారో, లేదో. మరి ఆయన నిర్ణయం ఎలావుంటుందో వేచి చూడాలి…..

  •  
  •  
  •  
  •  

Comments