పార్లమెంట్ ఆవరణలో ప్రత్యేక ఆకర్షణగా ఆ ఎంపీ కుమారుడు!!

Tuesday, March 13th, 2018, 06:00:11 PM IST

గుంటూరు నియోజక వర్గ ఎంపీ జయదేవ్, ప్రముఖ నటులు సూపర్ స్టార్ కృష్ణ గారికి స్వయానా పెద్దల్లుడు మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు కు బావ అనే విషయం అందరికి తెలిసిందే. ఇప్పటికే గుంటూరు నియోజకవర్గం లో యంపీ గా విజయం సాధించి మంచి పేరుతో ఆయన దూసుకెళ్తున్నారు. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ కు విభజన హామీలు నెరవేర్చకపోవడం, అలానే మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఆంధ్రకు సరైన న్యాయం చేయకపోవడం వల్ల అధికార టిడిపి సహా అన్ని పార్టీలు కేంద్ర బిజెపి పై నిరసన గళం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.

దీనిపై పార్లమెంట్ లో ఆంధ్ర యంపీ లు నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అందలో భాగంగా నేడు పార్లమెంట్ ఆవరణలో టీడీపీ ఎంపీల నిరసనలో ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు సిద్దార్థ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మంగళవారం ఉదయం పార్లమెంట్‌కు వచ్చిన సిద్దార్థ ఫ్లకార్డు పట్టుకుని పార్లమెంట్ ముందు నిలబడి నినాదాలు చేస్తుంటే, అటుగా వెళ్లేవారంతా ఎవరీకుర్రాడని ఆరా తీశారు. విభజన హామీలు అమలు చేయాలని రాసి ఉన్న ఫ్లకార్డును ప్రదర్శించిన సిద్దార్థ, ఏపీకి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అయితే సిద్దార్థ త్వరలో కృష్ణ, మహేష్ బాబు ల ఆశీస్సులతో సినీ రంగ ప్రవేశం చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి….

  •  
  •  
  •  
  •  

Comments