అమిత్ షా పై దాడి తెలుగు గూండాల పనే : సోము వీర్రాజు

Friday, May 11th, 2018, 10:56:14 PM IST


నేడు తిరుమల శ్రీ వారి దర్శనానికి కుటుంబంతో సహా విచ్చేసిన బిజెపి జాతీయ అధ్యక్షుడు అమితాషా పై కొందరు రాళ్ళ దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడిని బిజెపి నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇది ముమ్మాటికీ టిడిపి కార్యకర్తల పనే అని బిజెపి నేత సోము వీర్రాజు అంటున్నారు. ఈ దాడికి చంద్రబాబు సమాధానం చెప్పాలని, దాడి చేసిన వారిని గమనిస్తే వాళ్ళు రోప్ పార్టీని కూడా దాటుకుని ముందుకు వచ్చారంటే మామూలు విషయం కాదన్నారు. ఇది ఖచితముగా చంద్రబాబు డైరెక్షన్ లో జరిగిన పనే అని ఆయన అన్నారు. అయినా ఒక జాతీయ అధ్యక్షుడిపై ఈ విధంగా దాడి చేయించడం హర్షించదగ్గ పని కాదని టీడీపీ నేతలు దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాలన్నారు.

అయితే ఈ దాడి ఘటనపై చంద్రబాబు ఒకలా స్పందిస్తే, హోం మంత్రి చినరాజప్ప మరోలా స్పందిస్తున్నారని, టీడీపీ తిరుపతి నగర అధ్యక్షుడేమో అమిత్ షాపై నిరసన వ్యక్తం చేయడానికి వెళ్తున్నామని చెప్తున్నారని, ఇలా ఎవరికి తోచినట్లు వారు స్టేట్మెంటులు ఇస్తూ అందరిని అయోమయంలో పడేస్తున్నారని మండిపడ్డారు. అందుకే టీడీపీ ని తానూ తెలుగు డ్రామా ప్రత్యగా పిలుస్తానని అన్నారు. బిజెపి కార్యకర్తలను, నేతలను రెచ్చగొట్టే విధంగా టీడీపీ వారు ప్రవర్తిస్తే ఇకపై ఉపేక్షించేది లేదన్నారు. తమ పార్టీపై టీడీపీ వారు చేస్తున్న ఆరోపణలు, అసత్య ప్రచారాలను ఎదుర్కునే సత్తా తమకు ఉందని ఆయన తెలిపారు…….

  •  
  •  
  •  
  •  

Comments