ఆ పుకార్లు బాధించాయి…. రాహుల్ గాంధీ నాకు అన్నయ్య అవుతారు!

Sunday, May 6th, 2018, 08:00:38 PM IST


ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అక్కడ ప్రచారంలో నిమగ్నమయి వున్న రాహుల్ గాంధీ, ఆ ఎన్నికల తర్వాత పెళ్లి చేసుకోనున్నారనే వార్త కొద్దిరోజులుగా పుకారు షికారు చేస్తోంది. విషయంలోకి వెళితే రాహుల్ రాయ్ బరేలి నియోజకవర్గ ఎమ్యెల్యే అదితి సింగ్ ని త్వరలో వివాహమాడనున్నారని, ఈ విషయమై ఇప్పటికే వారిరువురి కుటుంబ సయుల మధ్య సమన్వయము కుదిరి ఒప్పుకున్నారని, త్వరలోనే పెళ్లి జరగనుందని ఈ పుకారు సారాంశం. నిజానికి ఈ పుకార్లపై అటు సోనియా కానీ, ఇటు రాహుల్ కానీ స్పందించలేదు. ఈ పుకార్లను రాయ్ బరేలీలో కొందరు వ్యక్తులు కావాలని సృష్టించారని, వారిద్దరి ఫోటోలు పెట్టి పెళ్లి శుభాకాంక్షలు తెలుపుతూ వాట్సాప్ వేదికగా రూమర్లు క్రియేట్ చేసారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.

అయితే ఈ విషయమై ఎట్టకేలకు నేడు రాయి బరేలి ఎమ్యెల్యే అదితి సింగ్ మీడియాతో మాట్లాడారు. గత కొద్దిరోజలుగా రాహుల్ కు తనకు వివాహం విషయమై వస్తున్న పుకార్లు తనను ఎన్నడూ లేనంతగా బాధించాయని, నిజానికి రాహుల్ తనకు పెద్దన్నయ్య అవుతారని, నేను ఆయనకు పలుమార్లు రాఖీకూడా కట్టానని అన్నారు. ఒక సోదరుడితో ఇటువంటి సంబంధాలు సృష్టించడం సరైన చర్యకాదని, దయచేసి ఇటువంటి రూమర్లు క్రియేట్ చేసి మమ్మల్ని బాధించవద్దని, వీటికి ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టాలని మీడియా వారి ద్వారా కోరారు…..

  •  
  •  
  •  
  •  

Comments