పెళ్ళికి ముందు శృంగారం తప్పు కాదన్న నటి….. ఫైరైన మహిళా సంఘాలు !

Tuesday, May 15th, 2018, 09:43:02 PM IST

ఇటీవల కొందరు నటీమణులు పెళ్ళికి ముందు శృంగారం తప్పుకాదు అని అనుచిత వ్యాఖ్యలు చేసి పలు సంఘాలు, అలానే ప్రజల ఆగ్రహానికి గురైన విషయం తెలిసిందే. అందులో ప్రముఖ తమిళ నటి కుష్బూ కూడా ఆ విధమైన వ్యాఖ్యలు చేసి అందరి ఆగ్రహానికి గురయ్యారు. అయితే ఆ తరువాత ఆమె తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పారు. కాగా ప్రస్తుతం మరొక యువ తమిళ నటి కూడా అదే వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో ఇరుక్కుంది. విషయంలోకి వెళితే, ఇటీవల తమిళంలో విడుదలయి విజయవంతంగా దూసుకెళ్తున్న అడల్ట్ కామెడీ హర్రర్ మూవీ ‘ఇరుట్టు అరైయిల్‌ మొరట్టు కుత్తు’ లో హీరోయిన్ గా నటించిన యాషిక ఆనంద్ ఒక సోషల్ మీడియా ఆన్ లైన్ ఇంటర్వ్యూ ప్రోగ్రాం లో ఈ వ్యాఖ్యలు చేసారు.

పెళ్ళికి ముందు అమ్మాయిలు శృంగారంలో పాల్గొనడం తప్పేనా అన్న ప్రశ్నకు ఆమె బదులిస్తూ, అస్సలు తప్పుకాదు. పెళ్ళికి ముందు చాలావరకు అబ్బాయిలు వర్జిన్ లు కానపుడు అమ్మాయులు మాత్రం అలా చేస్తే తప్పేముంది అని ప్రశ్నించారు. ఆడ, మగా కోరికల విషయంలో ఇద్దరు ఒకటేనని, అయినా ఎవరి ఇష్టాలు వారికి వుంటాయని అన్నారు. తనకు తాను అశ్లీల వీడియోలు చూస్తానని, అలా చూస్తూ ఒకరోజు తన తల్లితండ్రులకు పట్టుబడ్డానని అన్నారు. అయితే అదృష్టవశాత్తు వాళ్ళు తనని ఏమి అనలేదని చెప్పుకొచ్చింది. అంతటితో ఆగని అమ్మడు కొన్ని బూతు డైలాగులు, వ్యాఖ్యలు చేస్తూ మాట్లాడింది. కాగా ఆమె ఇంటర్వ్యూ ని సోషల్ మీడియా లో చూసిన వారు ఆమె చేసిన వ్యాఖ్యలను తప్పు పడుతున్నారు.

ఇప్పటికే కొన్ని మహిళా సంఘాలు ఇరుట్టు అరైయిల్‌ మొరట్టు కుత్తు చిత్ర ప్రదర్శన జరుగుతున్న హాళ్ల ముందు ధర్నా చేపట్టి ప్రదర్శన నిలిపివేశారు. మరోవైపు తమిళ సీనియర్ నటులు కొందరు కూడా యాషిక వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఆ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం అయినప్పటికీ, ఒక హీరోయిన్ అయిన తాను వాటిని మనసులో ఉంచుకోవాలి తప్ప బహిరంగంగా చెప్పడం సరైనది కాదు అంటున్నారు. కన్యగా చనిపోయిన ఒక అమ్మాయి దెయ్యంగా మారి ఒక బంగ్లా కు వచ్చే యువకులపై తమ కామ వాంఛను తీర్చుకోవడమే ఈ చిత్రం మూల కథాంశం. గౌతమ్ కార్తీక్, యాషిక, శాండిల్య విజె షరా నటించిన ఈ చిత్రానికి సంతోష్ జయ కుమార్ దర్శకత్వం వహించారు…….

  •  
  •  
  •  
  •  

Comments