కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవంలో ఆ ఇద్దరి అసంతృప్తి?

Thursday, May 24th, 2018, 02:31:57 PM IST

గత కొద్దిరోజులుగా మంచి రసకందాయం మధ్య సాగిన కర్ణాటక ఎన్నికలకు ఎట్టకేలకు ఒక ముగింపు పలకడం జరిగింది. నిన్న సాయంత్రం కన్నడనాట ముఖ్యమంత్రిగా 12ఏళ్ళ తర్వాత జేడీఎస్ అధినేత కుమార స్వామి ప్రమాణస్వీరం చేసి అధికారాన్ని చేపట్టారు. ఎంతో అంగరంగ వైభవంగా, అతిరథ మహారథుల సమక్షంలో బెంగళూరులోని విధాన సౌధ ప్రాంగణంలో జరిగిన విషయం తెలిసిందే. కాగా ఈ కార్యక్రమానికి యుపిఎ చైర్ పర్సన్ సోనియాగాఁధీ, రాహుల్, మమతా బెనర్జీ, చంద్రబాబు, కేసీఆర్, అఖిలేష్ యాదవ్, కేజ్రీవాల్ సహా ఇంకొందరు ప్రముఖ నేతలు విచ్చేసారు. అయితే ఈ సభా ప్రాంగణానికి రావడానికి మాత్రం పలువురు నేతలు ఇబ్బంది పడ్డట్లు తెలుస్తోంది.

మరీ ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అయితే చాలాసేపు ట్రాఫిక్ లో ఇరుక్కున్నారట. తన వాహనం ట్రిఫిక్ లో ఇరుక్కుని సరిగ్గా అక్కడి అసెంబ్లీ ముందు ఆగడంతో ఇంక చేసేది లేక అక్కడినుండి ఆమె తన అనుచరులతో కాలినడకన ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతున్న స్టేడియంకు విచ్చేసారు. తీవ్ర అసహనంతో ఆవిడ స్టేడియంలోకి ప్రవేశించడం అక్కడి కెమెరాలకు చిక్కింది. ఎలాగో స్టేడియంకు చేరుకున్న ఆమె, తన పక్కన వున్న కర్ణాటక పోలీస్ చీఫ్ నీలమణి రాజుతో ట్రాఫిక్ విషయంలో జరిగిన దానిపట్ల అసంతృప్తి వ్యక్తం చేశారట.

అంతే కాదు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్ కూడా స్టేడియంలో వాహనాల రద్దీ వల్ల చాలా దూరం నుండి కాలినడకన బయల్దేరి చివరకు స్టేడియంకు చేరుకున్నామని ఆప్ పార్టీ అధికార ప్రతినిధి రాఘవ్ చందా సోషల్ మీడియాలో తెలిపారు. బెంగళూరులో ఉన్నంత ట్రాఫిక్ నిజంగా దేశంలో ఎక్కడా ఉండదేమో, అందుకే సియం కేజ్రీవాల్ సహా మేమందరం చాలా దూరం నడిచే వచ్చాం అని ఆయన ట్విట్టర్ ద్వారా తన అసహనాన్ని తెలూపుతూ కొన్ని ఫోటోలు పోస్ట్ చేసారు. చివరకు ఈ విషయమై అక్కడి స్థానిక కొందరు నేతలు కూడా సీఎం కుమారస్వామితో చర్చించారని సమాచారం. ట్రాఫిక్ నియంత్రణకు రానున్న రోజుల్లో బెంగళూరులో మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని కుమారస్వామి వారికీ హామీ ఇచ్చినట్లు సమాచారం……

  •  
  •  
  •  
  •  

Comments