అది నవనిర్మాణ దీక్ష కాదు, నయవంచన దీక్ష : కన్నా లక్ష్మినారాయణ

Sunday, June 3rd, 2018, 12:13:04 PM IST

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పచ్చి అబద్దాల కోరు అని, ఆయన మంచి అనుభవజ్ఞుడు, రాష్ట్రాన్ని ప్రగతి పధంలో ముందుకు తీసుకువెళ్తాడు అని నమ్మి ఆయనకి అధికారమిస్తే, ప్రజాసంక్షేమం వదిలి కేవలం తమ నేతలు దోచుకోవడానికి మాత్రమే అధికారాన్ని ఉపయోగిస్తున్నారని ఏపీ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మి నారాయణ అన్నారు. నిన్న అయన ఏపీ బిజెపి అధ్యక్షుడుగా పదవిని అధికారికంగా చేపట్టిన సందర్భంగా విలేకరులతో కాసేపు ముచ్చటించారు. కాంగ్రెస్ పార్టీకి బాబు అద్దెమైకు వంటివారని అన్నారు. కేంద్ర కాంగ్రెస్ పెద్దలు రాహుల్ గాంధీ, సోనియాల మెప్పు కోసమే మోడీ, అమిత్ షాలపై దుష్ప్రచారం చేస్తున్నారు అన్నారు. కాంగ్రెస్ కు మీకు జరిగిన లాలూచి ఏమిటో చంద్రబాబు చెప్పాలని, ఇటువంటి వారికి ప్రజలు రానున్న రోజుల్లో తగిన రీతిన బుద్ధి చెపుతారని అన్నారు. మొదట్లో ప్రత్యేక హోదా వద్దన్న బాబు మళ్లి ఇప్పుడు కొత్తగా ఆ వాదాన్ని తెరపైకి ఎందుకు తీస్తున్నారో, దానివెనుక మర్మమేమితో బయటపెట్టాలన్నారు.

అన్నం పెట్టిన చేతిని సైతం విరిచేయగల కుటిల బుద్ధి చంద్రబాబుది అని ఆయన మండిపడ్డారు. నిన్న అయన చేసింది నవనిర్మాణ దీక్ష కాదని, నయవంచన దీక్ష అని ఎద్దేవా చేశారు. కేంద్రం ఇప్పటికే ఇచ్చిన హామీల్లో చాలా వరకు అమలు చేసిందని, నిధులు తీసుకున్న టిడిపి నేతలు, నేడు నిధులు సక్రమంగా రాలేదు అని బీజేపీని, మోడీ ని విమర్శించడం వారి నీచ బుద్ధికి నిదర్శనమన్నారు. ఇప్పటివరకు మోడీ 156 సంక్షేమ పధకాలను అమలు చేసి ప్రజల సంక్షేమానికే అనునిత్యం పాటుపడుతున్నారని అన్నారు. ఇప్పటికే ఏపీలో టీడీపీ ప్రాభవం పూర్తిగా తగ్గిపోయిందని, ప్రజలు మీ పార్టీ నేతల అవినీతి అక్రమాలను పూర్తిగా గమనిస్తున్నారని అన్నారు. ఏపీలో బీజేపీ ని తొక్కిపట్టే శక్తీ టీడీపీకి లేదని, రానున్న ఎన్నికల్లో ప్రజలు మా పార్టీకి మంచి మెజారిటీ అందిస్తారన్న నమ్మకముందని అన్నా రు…..

  •  
  •  
  •  
  •  

Comments