చంద్రబాబుకు, ఎన్టీఆర్ కు అదే తేడా : చినరాజప్ప!

Sunday, May 6th, 2018, 11:53:12 PM IST


ఆంధ్ర ప్రదేశ్ హోమ్ శాఖమంత్రి నిమ్మకాయల చినరాజప్ప నాటి టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కు, నేటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు వున్న తేడాను చెప్పారు. ఇటీవల ఆయన ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ఎన్టీఆర్ కు చంద్రబాబుకు ఒక్క విషయంలో మాత్రం కొంత తేడావుందని అన్నారు. ఏ విషయంలో అయినా నిర్ణయం తీసుకోవాలంటే ఎన్టీఆర్ కాస్త త్వరగా తీసుకుంటారని, అదే చంద్రబాబు అయితే కొంచెం ఎక్కువగా ఆలోచిస్తారని అన్నారు. ఎన్టీఆర్ సమయాభావం వల్ల నష్టం కలగకూడదని ఆలోచిస్తే చంద్రబాబు మన చుట్టూ వున్నవారు కూడా మన వాళ్లే కదా, వారికి ఎలా నచ్చచెప్పాలి అని ఎక్కువ ఆలోచిస్తుంటారని, ఆయనకు మంచితనం కొంచెం ఎక్కువని అన్నారు. నిజానికి ఎన్టీఆర్, చంద్రబాబు ఇద్దరూ రాష్ట్రానికి అద్భుతమైన పాలన అందించారని, ఇరువురు మంచి సమఉజ్జీలని చెప్పుకొచ్చారు.

ఇకపోతే రానున్న ఎన్నికల్లో ఎవరెవరికి టీకెట్లు ఇవ్వాలి అనే దానిపై ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్యెల్యే ల పనితీరు, ప్రజల్లో వారి గురించిన స్పందన తదితరాలపై చంద్రబాబు ఒక సర్వే చేయిస్తున్నారని దాన్ని బట్టి రానున్న ఎన్నికల్లో సీట్లు కేటాయించే అవకాశం వుందని అన్నారు. టీడీపీ ప్రజలకోసం, వారి అభ్యున్నతి కోసం పాటుపడుతుంటే మరొకవైపు వైఎస్సార్ పార్టీ అధినేత జగన్ మాత్రం బిజెపితో లాలూచీపడి తన పై కేసులను ఎత్తివేసేలా పథకాలు రచిస్తున్నారని అన్నారు. పవన్ కళ్యాణ్ మొదట్లో మోడీకి గొడుగు పట్టరాని, కానీ రాను రాను మోడీ ప్రభావం తగ్గుతుండడంతో ఆయన కూడా ఆలోచనలో పడ్డారని, అయితే ఆయన దృష్టి భవిష్యతులో ఎటువైపు ఉంటుందో వేచిచూడాలని అన్నారు. ప్రజల కోసం తమ పార్టీ ఎందాకైనా వెళుతుందని, కేంద్రం పై బాబు పోరాటం ఆగదని, మనకు న్యాయం జరిగేవరకు పార్టీ నేతలందరూ పోరాటాలతో శ్రమిస్తూనే ఉంటారని చెప్పారు…….

  •  
  •  
  •  
  •  

Comments