ఆ టైటిల్ అందుకే పెట్టాం : దర్శకుడు కళ్యాణ్ కృష్ణ

Sunday, May 20th, 2018, 11:17:45 AM IST

మాస్ మహారాజ రవితేజ హీరోగా మాళవిక శర్మ హీరోయిన్ గా రామ్ తాళ్లు నిర్మాతగా, ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సోగ్గాడే చిన్ని నాయనే, రారండోయి వేడుక చూద్దాం చిత్రాల దర్శకుడు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నేల టికెట్’. ఇటీవల విడుదలైన ఈ చిత్ర పాటలకు, ట్రైలర్ కు మంచి స్పందన వస్తోంది. ఈ సందర్భంగా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ మీడియా తో చిత్ర విశేషాలను పంచుకున్నారు. హీరోగా రవితేజ ఎప్పుడూ చాలా సరదాగా వ్యవహరించే వ్యక్తి అని, ఆయన తో పనిచేయడం చాలా కంఫర్ట్ గ ఉంటుందని అన్నారు. హీరోయిన్ మాళవిక పాత్రకు కూడా చిత్రంలో మంచి ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. ఇక తాను చిత్రం పై మంచి నమ్మకంతో వున్నానని, లవ్, ఫామిలీ అండ్ ఎమోషన్స్ తో కూడిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను తప్పక అలరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

యూనిట్ సభ్యులందరి సపోర్ట్ తో చిత్రం షూటింగ్ మొత్తాన్ని 90 రోజుల్లో పూర్తి చేయగలిగామని, తనకు సహకరించిన ప్రతిఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. హీరో క్యారెక్టర్ పరంగా ఒక ఆవారాగా తిరుగుతుంటాడని, అయినప్పటికి అందరిని ఒక కుటుంబంలా కలుపుకు వెళ్లే వ్యక్తిత్వం ఉంటుందని చెప్పుకొచ్చారు. రవితేజ గారి మార్క్ పంచ్ లు, మంచి ఎంటర్టైన్మెంట్, కథలోనే మిళితమైన ఎమోషన్ చిత్రానికి ప్రధాన ఆకర్షణ అవుతాయని చెప్పారు. హీరో చిత్రం లో ఎక్కువగా మాస్ జనాలతో తిరుగుతూ ఉంటాడని, ఆ విధంగానే చిత్రానికి నేల టికెట్ అని టైటిల్ పెట్టామని అన్నారు. మా ఈ నేల టికెట్ బాల్కనీ ప్రేక్షకులను కూడా తప్పక మెప్పిస్తుందనే నమ్మకంతో ఉన్నామని, ప్రేక్షకులు తమకు మంచి విజయం అందిస్తారని నమ్ముతున్నట్లు కళ్యాణ్ కృష్ణ తెలిపారు. కాగా ఈ చిత్రం ఈ నెల 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది…..

  •  
  •  
  •  
  •  

Comments