జనసేనలోకి చేరిన సరిహద్దు “సైనికులు”..!

Wednesday, September 5th, 2018, 12:46:41 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా, మిలట్రీ మాధవ వరం అనే గ్రామం లో పవన్ కళ్యాణ్ గారి పుట్టిన రోజు పురస్కరించుకొని, సరిహద్దుల్లో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల స్థూపాల వద్ద నివాళులు అర్పించి, జనసేన రాష్ట్ర కోశాధికారి మారిశెట్టి రాఘవయ్య గారు మాట్లాడుతూ మొన్న జనసేన అధ్యక్షుడు ఐన పవన్ కళ్యాణ్ గారి పుట్టిన రోజు సందర్భంగా దాదాపు ఒక లక్ష వరకు ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలో మాత్రమే సభ్యత్వాలు నమోదు చేశారని, ఒక్క రోజులో ఇన్ని సభ్యత్వాలు చెయ్యడం ఏ పార్టీలోను జరగలేదు అని తెలిపారు అంతే కాకుండా, దేశ సరిహద్దుల్లో ఇప్పటి వరకు పని చేసి వారి పదవి నుంచి విరమణ తీసుకున్నారో ఇప్పుడు వారు అందరు జనసేన పార్టీ కి పవన్ కళ్యాణ్ గారికి వెన్నంటే వారి మిగతా శేష జీవితాన్ని ఇచ్చేందుకు ముందుకు వచ్చి సభ్యత్వాలు నమోదు చేసుకున్నారని తెలిపారు.

ఇదే సందర్భం లో జనసేన పార్టీలో ముఖ్యులు అయినటువంటి శ్రీ అద్దేపల్లి శ్రీధర్ గారు మాట్లాడుతూ పార్టీ పెట్టక మునుపే పవన్ కళ్యాణ్ గారు సామాన్యులు నుంచి అతి సామాన్యులు వరకు ప్రతి ఒక్కరితోను చర్చించి పార్టీని పెట్టడం జరిగింది అని గుర్తు చేసారు. అంతే కాకుండా పార్టీ లో పెట్టిన ప్రీ మేనిఫెస్టో ని మరియు వారి యొక్క సిద్ధాంతాల్లో అందరిని కలుపుకుంటూ వెళ్ళాలి అనే దానికి ఈ సంఘటన కూడా ఒక నిదర్శనం అని తెలిపారు, అదే సందర్భం లో పవన్ కళ్యాణ్ గారు ప్రజా పోరాట యాత్ర లో ధరించే ఆలివ్ గ్రీన్ మిలట్రీ చొక్కా ధరించడం లో ఆయన్ని మన దేశం పట్ల మన సరిహద్దుల్లో సైనికుల పట్ల ఉన్న గౌరవాన్ని గుర్తు చేసారు, ఆ మిలట్రీ చొక్కాని ధరించి భారత సరిహద్దుల్లో శత్రు సైనికులు ఈ మిలట్రీ చొక్కాని ధరించి ఆంధ్ర రాష్ట్రం లో పవన్ కళ్యాణ్ గారు దేశ మరియు రాష్ట్ర సమగ్రత కోసం పాటు పడుతున్నారని, విరమణ తీసుకున్న అనంతరం జనసేన పార్టీ లోకి చేసుచేరడం తో హర్షం వ్యక్తం చేస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments