భారత్ వింగ్ కమాండర్ అభినందన్ పై కేసు…?

Friday, March 8th, 2019, 04:43:15 PM IST

ఇటీవల ప్రపంచమంతా మారుమ్రోగిన పేరు భారత్ వింగ్ కమాండర్ అభినందన్… తాను ప్రదర్శించినటువంటి ధైర్య సాహసాలకు యావత్ ప్రపంచం అంత కూడా అతని ముందు తలవంచింది. కానీ అభినందన్ పైనే నేడు ఒక కేసు నమోదు అయ్యింది. అది కూడా పాకిస్థాన్ అటవీ శాఖా లో…ఇటీవల బాలాకోట్‌లో భారత్‌ వైమానిక దళానికి చెందిన యుద్ధవిమానాలు బాంబులు వేయడం ద్వారా ఆ ప్రాంతంలో ఉన్న చెట్లు అన్ని కూడా ధ్వంసమయ్యాయని పాక్ పెట్టిన కేసులో వెల్లడించింది.

కాగా అభినందన్‌పై కేసు నమోదు చేసిన అంశంపై పాక్ మీడియాలో పలు కథనాలు ప్రసారమవుతున్నాయి… భారత్ కు చెందిన యుద్ధ విమానాలు బాంబు దాడి చేయడం వలన పాక్ లో ఉన్నటువంటి పర్యావరణం అంతకుడా నాశనం అయిందని, ఈ విషయానికి సంబందించిన వివరాలని యూఎన్ఓ కు పాకిస్థాన్, భారత్ పై ఫిర్యాదు చేయనుందని పాక్ కి సంబందించిన ప్రముఖ మీడియా సంస్థ పేర్కొంది.