సంక్రాంతి కి దుమ్మురేపనున్న సెలబ్రిటీ కుటుంబాలు…

Friday, January 11th, 2019, 06:20:43 PM IST

ప్రతి పండక్కి ఎన్నో ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రామ్స్ చేసే ఈటీవీ ఈసారి రాబోయే సంక్రాంతికి ఒక గొప్ప ప్రోగ్రామ్ కి శ్రీకారం చుట్టింది. అదేంటో కాదు ఈటీవీ లో ప్రదర్శితమయ్యే అన్ని ప్రోగ్రామ్స్ కి సంబందించిన నటీనటులందరిని మరియు వారి కుటుంబాలని సకుటుంబ సపరివార సమేతంగా ఒకే వేదిక పైకి ఆహ్వానించి, వారితో కూడా స్కిట్స్ చేపించారు. వాళ్ళ ప్రదర్శన ఎలావుందంటే జబర్దస్త్ కామెడియన్లను తలదన్నేలా ఉందని సమాచారం. అందరు కలిసి ఆ ప్రోగ్రాం ఇరగదీశారని చెప్పుకుంటున్నారు.

ఈ ప్రదర్శనలో జడ్జెస్ అయినటువంటి నాగబాబు గారు మరియు రోజా వారి కుటుంబ సభ్యులు కూడా అందరు హాజరయ్యి ఒక పెద్ద పండగ వాతావరణాన్ని ఏర్పాటు చేశారు. వారితో పాటు ప్రతి ఒక్కరి కుటుంబాలు కూడా హాజరయ్యి ఎంతో ఆహ్లాదకరంగా సంబురాలు జరుపుకున్నారు.

అంతే కాకుండా ఈ షో కి హాజరయిన ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ వారి జీవితంలో జరిగిన ఒడిదుడుకులను చెప్పుకుంటూ ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. చివరికి అందరు కూడా ఎంతో ఆనందంగా సంక్రాతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రదర్శన సంక్రాతి పండగ రోజున ప్రదర్శితం అవనుంది.

ఇప్పటికే ఈ ప్రోమో యు ట్యూబ్ ఛానల్లో దుమ్మురేపుతోంది. చాలా వైరల్ అవుతుంది. ఇప్పుడే ఇలా ఉందంటే మొత్తం ప్రోగ్రామ్ టీవిలో వచ్చాక ఎలా ఉంటుందో అంచనాలకి అందడం లేదు.

Click here for video