మొదలైన ఎంపీ సీట్ల లొల్లి – అయోమయంలో కాంగ్రెస్ అధిష్టానం

Saturday, February 9th, 2019, 01:24:01 PM IST

తెలంగాణాలో మళ్ళీ ఎన్నికల వాతావరణం రాజుకోనుంది. రానున్న సార్వత్రిక ఎన్నికలకి అందరు కూడా సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. ఎలాగైనా ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని అందరుకూడా కసితో ఉన్నట్లు సమాచారం. అయితే కాంగ్రెస్ పార్టీ లో ఈ హడావుడి ఇప్పటికే ప్రారంభం అయ్యింది. ఎంపీ స్థానాల్లో అభ్యర్థులు అందరు కూడా ఇప్పటికే పెద్ద వారితో కలిసి ఎలాగైనా తమకే టికెట్ దక్కేలా ప్రయతలు ముమ్మరం చేస్తున్నారు కూడా. కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాత్రం అన్ని వైపులా ఆలోచించి టిక్కెట్లను ఖరారు చేయనుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే… కాగా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కూడా తామే విజయం సాధిస్తామని తెరాస నాయకులూ ఇప్పటికే చెప్పుకుంటున్నారు. కానీ అలంటి తప్పు మళ్ళీ ప్రజలు చేయరని, ఎలాగైనా తామే విజయం సాధిస్తామని కాంగ్రెస్ నాయకులూ చెప్పుకుంటున్నారు.

అయితే కాంగ్రెస్ పార్టీ లో ఎంపీ టిక్కెట్ల కోసం ఇప్పటికే గొడవలు కూడా జరుగుతున్నాయని సమాచారం. ఈ నెలాఖరులోగా లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం ఉందని వస్తున్న వార్తల నేపథ్యంలో, ఆ పార్టీ నాయకులు అప్పుడే ఈ ఎన్నికలపై దృష్టి సారించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని నల్లగొండ, భువనగిరి లోక్‌సభ నియోజకవర్గాలకుగాను గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ ఒక్కో స్థానాన్ని గెలుచుకున్నాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో లోక్ సభ ఎన్నికలపై సర్వత్ర్ర ఆసక్తి నెలకొంది. నల్లగొండ స్థానంనుంచి తాను పోటీకి దిగుతానని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. కాగా, నల్లగొండ స్థానం నుంచి టికెట్‌ ఆశిస్తున్న వారిలో కోమటిరెడ్డి పేరు మినహా రెండో పేరు వినబడకపోవడం గమనార్హం.

భువనగిరి లోక్‌సభ స్థానం నుంచి టికెట్‌ ఆశిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. భువనగిరి నుంచి ఎన్నికల బరిలోకి దిగడానికి సుముఖంగా ఉన్నానని, తనకు టికెట్‌ కేటాయించాలని టీపీసీసీ అధికార ప్రతినిధి చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి కోరుతున్నారు. ఆయన ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ కుంతియాను కలిసి తనకు టికెట్‌ కేటాయించి పోటీ చేసే అవకాశం కల్పించాలని దరఖాస్తు చేసుకున్నారు. అంతేకాకుండా నల్లగొండ స్థానాన్ని ఓసీలకు కేటాయించే పక్షంలో భువనగిరి టికెట్‌ను బీసీలకు కేటాయించాలన్న డిమాండ్‌ కూడా పార్టీలో ఉంది.