బిగ్ బ్రేకింగ్ : తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్య‌ర్థుల తొలి జాబితా విడుద‌ల‌…!

Friday, March 15th, 2019, 11:42:15 PM IST

తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్య‌ర్థుల తొలి జాబితా విడుద‌లైంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎనిమిది మంది పేర్ల‌ను తొలి జాబితాలో పేర్కొంది. గ‌త ఏడాది చివ‌ర్లో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యే బ‌రిలో ఓట‌మిని చ‌వి చూసిన ఆ పార్టీ తెలంగాణ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని ఈ సారి మ‌ల్కాజిగిరి ఎంపీ పోటీలో నిలిపింది. అయితే, కాంగ్రెస్ విడుద‌ల చేసిన తొలి జాబితాలో ఎనిమిది మంది అభ్య‌ర్థుల వివ‌రాలిలా ఉన్నాయి..

ఆదిలాబాద్ : ర‌మేశ్ రాథోడ్
మ‌హ‌బూబాబాద్ : బ‌ల‌రాం నాయక్
పెద్ద‌ప‌ల్లి : ఏ.చంద్ర‌శేఖ‌ర్‌
క‌రీంన‌గ‌ర్ : పొన్నం ప్ర‌భాక‌ర్
మ‌ల్కాజ్‌గిరి : రేవంత్‌రెడ్డి
జ‌హీరాబాద్ : మ‌ద‌న్‌రావు
చేవెళ్ల : కొడా విశ్వేశ్వ‌ర్‌రెడ్డి
మెద‌క్ : గాలి అనీల్‌కుమార్

ఇంకా 9 పార్ల‌మెంట్ స్థానాల‌కు కాంగ్రెస్ అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేయాల్సి ఉంది.