పొత్తు లేదంటే లోపాయికారీ ఒప్పందం ఉన్నట్టే కదా !

Friday, January 11th, 2019, 01:50:50 PM IST

రాజకీయాల్లో పొత్తుల మాటొస్తే ముందుగా బాబుగారే గుర్తొస్తున్నారు. ఎన్నికలు దగ్గరపడే కొద్ది ఆయనలో స్నేహ భావం పెరిగిపోతుంది. అందుకే తెలంగాణ ఎన్నికల కోసం కాంగ్రెస్ హస్తం అందుకున్నారు. ఆ స్నేహం తరవాత ఫలితాన్ని దెబ్బతీసింది కూడ. అందుకే ఏపీలో ముందుగా ప్లాన్ చేసుకున్నట్టు కలిస్ పోటీకి దిగకూడదని రాహుల్, చంద్రబాబులు నిర్ణయించుకున్నరట.

ఎందుకంటే రాష్ట్రాన్ని తీసుకున్న తెలంగాణ ప్రజలే కాంగ్రెస్ ను టీడీపీతో కలిసివుడ్నని తిరస్కరించింది. అలాంటిది రాష్ట్రాన్ని ఇష్టం లేకుండా విడగొట్టిన కాంగ్రెస్ పార్టీతో కలిసి టీడీపీ బరిలో దిగుతానంటే ఏపీ ప్రజలు ఒప్పుకోరని ఇరు పార్టీలకు అర్థమైపోయింది. అందుకే కేంద్రంలో మాత్రమే దోస్తీగా ఉందామని నిర్ణయించేసుకున్నట్టు కనిపిస్తున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే ఎన్నికల పోటీలో వీరి మధ్య లోపాయికారీ వ్యవహారం ఉండకుండా ఉండదు.

మిత్రులుగా మెలుగుతున్న వీరు ఒకరి ఓటు బ్యాంకును మరొకరు కొల్లగొట్టాలనుకోరు. అందుకే నియోజకవర్గాల వారీగా లెక్కలు వేసుకుని డమ్మీ అభ్యర్థులను సిద్ధం చేయొచ్చు. ఈ లెక్కలు ఎలా ఉండబోతున్నాయంటే ఒప్పందం కుదిరిన స్థానాల్లో వైకాపా, జనసేనల ఓట్లు చీలి డమ్మీ అభ్యర్థులకు పడేలా ఉండబోతున్నాయి.