కెసిఆర్ దెబ్బకు మిగతా జెండాలు మట్టికరవడం కాయం…. కే టీ ఆర్

Friday, November 2nd, 2018, 01:09:16 PM IST

మహా కూటమికి ఓటేస్తే మనం మళ్ళీ బ్రిటిష్ పరిపాలనని కొనితెచ్చు కున్నట్లేనని మంత్రి కేటీఆర్ గారు పేర్కొన్నారు. ఎన్టీఆర్ లాంటి మహా నాయకుడినే ఓడించిన ఘనత మన కల్వకుర్తి కి ఉంది. ఇక్కడి ప్రజలు తల్చుకుంటే ఏదైనా సాధిస్తారని, ఆనాడు టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ ని ఓడించిన ఘనత ఇక్కడి ప్రజల సొంతం అని గురువారం నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి లో నిర్వహించిన ప్రజా ఆశీర్వద సభలో కేటీఆర్ మాట్లాడారు. ఈ సందర్బంగా అక్కడ హాజరైన ఒక మహిళా ఇచ్చినటువంటి ఉత్తరాన్ని కేటీఆర్ చదివి వినిపించారు. కూతురి పెళ్ళికి మేన మామ సామాన్లు ఇచ్చాడు, అంతలోనే చిన్న గొడవ జరిగి ఇచ్చిన సామాన్లను వెనక్కి తీసుకెళ్లాడు. అపుడు సీఎం కెసిఆర్ ఇచ్చిన షాదీ ముబారక్ చెక్కు నా పరువు కాపాడింది అని దాంట్లో రాసి ఉందని చెప్పాడు. అది రాసింది వెల్డందా మండలానికి చెందిన గౌసియాభేగం. ఇలాంటి ఎందరో పేదవాళ్ల మొకాల్లో నవ్వుల పువ్వులు పూయించిన ఘనత కెసిఆర్ కె దక్కుతుందన్నారు. నీళ్లు , నిధులు, నియామకాల కోసమే ఈ రాష్ట్రాన్ని సాధించుకున్నామని చెప్పుకొచ్చారు. రైతులకి పంట పెట్టుబడి కోసం ఎకరాకు 8వేలు ఇచ్చిన ఘనత ఒక్క కెసిఆర్ కే దక్కుతుందన్నారు. ఇలాంటి లక్ష్యసాధన కోసమే ప్రజలు కాంగ్రెస్ ని కాదని తెరాస ని గెలిపించుకున్నారు. కెసిఆర్ గారు తొలుత రైతు కావడం వలెనే మన ప్రభుత్వం ఏర్పడగానే ముందుగా 17కోట్ల రుణ మాఫీ చేసారు. మల్లి అదికారం లోకి రాగానే ఒక్కో రైతు కి అక్షరాలా లక్ష రూపాయలు రుణమాఫీ చేయనున్నట్లు తేలిపారు. అభివృద్ధికి, ఎదుగుదలకి అడ్డంకిగా మారిన కాంగ్రెస్ టీడీపీ ల కుట్రలను తిప్పి కొట్టి వారికీ తగిన గుణపాఠం చెప్పాలన్నారు.

పాలమూరు కి నీరందించే పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పతాకం పై, ఉత్తర తెలంగాణ ప్రాంతానికి త్రాగు, సాగు నీరందించే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణాలపై కేసులు వేసి వాటిని ఆపే ప్రయత్నాలు చేసారు కాంగ్రెస్ నాయకులు. వారు ఇప్పటివరకు 200కేసులు పెట్టగా, ప్రాజెక్టులు ఆపాలని చంద్రబాబు కేంద్రానికి 30 ఉత్తరాలు రాసినప్పటికీ అవేవి మేము పట్టించుకోకుండా అన్ని పనులు పూర్తి చేస్తూ ముందుకు వెళ్తున్నాము. ఈ ఎన్నికలలో మల్లి తెరాస కి పట్టం కట్టాలని విన్నవించారు. రాబోయే ఎన్నికలలో మరోసారి కెసిఆర్ ముఖ్యమంత్రి కావాలంటే మీ ప్రజా ప్రతినిధిగ జైపాల్ యాదవ్ ని గెలిపించాలని కోరారు.

చివరగా ముఖ్యమంత్రి కెసిఆర్ గారు తన మాటగా చెప్పామన్నారు. డిసెంబర్ 11న కొత్త ప్రభుత్వం ఏర్పడగానే రైతుబంధు పథకం కింద రూ.11వేలు, రూ. 1000 ఫింఛనుకు రూ.2016, వికలాంగులకు ఇచ్చే రూ.1500కు బదులు రూ.3016, నిరుద్యోగ భృతి కింద ఆర్ధిక సహాయం అందజేస్తామని చెప్పమన్నారని కేటీఆర్ తెలిపారు.