మేనిఫెస్టోకు అర్థం పవన్ చూపించారు – పవన్ ని ఆకాశానికి ఎత్తేసిన ప్రముఖ దర్శక నిర్మాత

Saturday, March 16th, 2019, 02:34:49 AM IST


జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల విడుదల చేసినటువంటి తన పార్టీ కి సంబందించిన మేనిఫెస్టో చాలా బాగుందని ప్రముఖ దర్శక నిర్మాత కొనియాడారు. ప్రముఖ తెలుగు సినిమా దర్శక, నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి మాట్లాడుతూ… పవన్ కల్యాణ్ విడుదల చేసిన మేనిఫెస్టో అంశాలు చాలా బాగున్నాయి, ప్రజలను ఆలోచింపజేసేలా ఈ అంశాలు ఉన్నాయన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా మేనిఫెస్టో ఉందని, ‘‘తమిళనాడులో ప్రజా సంక్షేమమే ప్రధానంగా తయారుచేసే మానిఫెస్టోల మాదిరి జనసేన మేనిఫెస్టో ఉందని అన్నారు.

జనసేన మేనిఫెస్టో తో పవన్‌ కల్యాణ్ గ్రాఫ్ పెరుగుతుందని, అంతేకాకుండా రానున్న ఎన్నికల్లో ఈ జనసేన మేనిఫెస్టో చాలా ప్రభావం చూపుతుందని కేతిరెడ్డి అన్నారు. పవన్‌కు చాలా మంది అభిమానులు ఉన్నారనీ.. పవన్ ప్రచారంలో సాధారణ ప్రజలను ఆకట్టుకుంటున్నారు. కానీ పవన్ బలం ముందు అని కూడా దిగదుడుపే అని, రానున్న ఎన్నికల్లో పవన్ విజయం సాధించడం ఖాయమని ఆయన అన్నారు .