అరెరె..! లోకేశ్ పిట్ట‌ల దొర‌లా త‌యార‌య్యాడే..!!

Friday, March 15th, 2019, 01:25:43 AM IST

ఏపీ బీజేపీ నేత విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డి ఇవాళ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్‌పై సెటైర్ల వ‌ర్షం కురిపించారు. మంత్రి స్థాయిలో ఉన్న నారా లోకేష్ రోజు రోజుకు త‌న దిగ‌జారుడు త‌నంతో పిట్ట‌ల‌దొర‌లా త‌యార‌వుతున్నాడ‌ని విమ‌ర్శించారు. ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లో ఉన్నా చంద్ర‌బాబు స‌ర్కార్ జీవోల‌ను విడుద‌ల చేస్తుంద‌ని, అది ప్ర‌జాస్వామ్యానికే విరుద్ధ‌మ‌న్నారు. జీవోల జారీ విష‌యంలో అధికారులు చంద్ర‌బాబుకు స‌హ‌క‌రిస్తే జైలుకెళ‌తార‌ని, చంద్ర‌బాబు పుణ్య‌మా అని జైలు మెట్లెక్కేలా అధికారులు వ్య‌వ‌హ‌రించొద్ద‌న్నారు.

టీడీపీ ఎంపీలు ఒక్కొక్క‌రుగా పార్టీని వీడుతుండ‌టంతో చంద్ర‌బాబు ఒక్క‌సారిగా డిప్రెష‌న్‌లోకి వెళ్లిపోయార‌న్నారు. ఎన్నిక‌ల ఓట‌మి క‌ళ్ల‌ముందు క‌న‌బ‌డుతున్నా పైకి గాంభీర్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్న చంద్ర‌బాబుకు ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చ‌ని ఎద్దేవ చేశారు. మంత్రి నారా లోకేశ్ మంగ‌ళ‌గిరి నుంచి కాకుండా, దుమ్ముంటే రాయ‌ల‌సీమ నుంచి పోటీ చేయాల‌ని స‌వాల్ చేశారు. టీడీపీ నేత‌లు ప్ర‌చారానాకివెళ్తే ప్ర‌జ‌లు రాళ్ల‌తో కొడతారంటూ విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డి విమ‌ర్శించారు.