పేరుకే పెద్ద హీరోలు… చిన్న ఫైన్లు కూడా కట్టలేకపోతున్నారు…

Saturday, January 12th, 2019, 01:45:56 PM IST

పేరుకే చాలా పెద్ద పేరున్న హీరోలు… కానీ వీళ్ళు సినిమాల్లో చెప్పిన విధంగా నిజ జీవితంలో ఉండలేరు. సినిమాల్లో చాలా నీతులు చెబుతున్నారు కానీ బయట ప్రపంచానికి వచ్చే సరికి అసలేం పట్టనట్లు ఉంటున్నారు కూడా… వీరు ట్రాఫిక్ రూల్స్ ని ఉల్లంఘించారు. దానికి ఫైన్ కట్టాల్సింది పోయి తమకేం పట్టనట్లుగా తిరుగుతున్నారు. ఆ చలాన్లు గత మూడు సంవత్సరాలక్రితం కట్టాల్సినవి కానీ వాటినేమి పటించుకోవడం లేదు. ఆ ప్రముఖ నటులు మరెవరో కాదు… నందమూరి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు. వారు ప్రయాణించిన వాహనాలు పార్కింగ్ నిబంధనలు మరియు అధిక స్పీడ్ నిబంధనలను ఉల్లంఘించి ట్రాఫిక్ పోలీసుల దృష్టిలో పడ్డారు. ఇప్పటికి కూడా ఆ చలాన్లు అలాగే ఉండిపోయాయి…

అత్యధిక చలాన్లు కట్టాల్సిన లిస్టులో మొదటి పేరు మహేష్ బాబు ది. 2016 లో ఏడు సార్లు ట్రాఫిక్ కెమెరా కళ్ళకి చిక్కాడు. ఆ మొత్తం రుసుము 8745. అప్పటినుండి ఇప్పటిదాకా అసలు వాటిని కట్టడం లేదు. ఆ తరువాత స్థానంలో నందమూరి బాలకృష్ణ ఉన్నారు. బాలకృష్ణ అతివేగంగా ప్రయాణించడంతో 1035 రూపాయల ఫైన్ కట్టాల్సి ఉంది కానీ వాటిని బాలకృష్ణ పట్టించుకోవడం లేదు. ఆ తరువాత పవన్ కళ్యాణ్ 2016 లోనే పార్కింగ్ నిబంధనలకు విరుద్ధంగా తన కారు ఆపినందుకు రూ. 505 ఫైన్ కట్టాల్సి ఉంది. కానీ కట్టడం లేదు. వీరితో పాటు మరికొంత మంది సినీ ప్రముఖులు కూడా ఉన్నారు. ఒక వేళ వారి చలాన్లు 10 దాటితే వారి వాహనాలను సీజ్ చేస్తామని హైదరాబాద్ అదనపు ట్రాఫిక్ కమిషనర్ అనిల్ కుమార్ తెలిపారు.