పింఛన్ ల పెంపు- కెసిఆర్ ని అనుకరిస్తున్న బాబు

Friday, January 11th, 2019, 10:43:15 PM IST

ఏపీ లో ఎన్నికలు దగ్గరయ్యే కొద్దీ ప్రజలకు వరాలు కూడా బాగానే ప్రకటిస్తున్నారు నేతలు… తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏపీ ప్రజలకి సంక్రాతి సందర్భంగా ఒక కానుకని ప్రకటించాడు. ఇప్పటికే అమలులో ఉన్నటువంటి ఫించన్లను రేటింపు చేస్తూ నిర్ణయం తీసుకున్నాడు. ప్రస్తుతం ఉన్న వెయ్యి రూపాయల ఫించన్ ను రూ.2 వేలకు పెంచారు. ఈ నెల ఫించన్ తీసుకున్న వారికి వచ్చే నెలలో మిగిలిన రూ. వెయ్యి చెల్లింస్తామని తెలిపారు. దివ్యాంగులు, హిజ్రాలకు ఇస్తున్న రూ.1500 ఫించన్ కూడా రెట్టింపు చేశారు. 2014 సంవత్సరానికి ముందు ఫించన్ నెలకు రూ.200 మాత్రమే ఉండేది.

నెల్లూరు జిల్లా బోగోలులో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో సీఎం చంద్రబాబు గారు ఈ ఫించన్ల వివరాలని ప్రకటించారు. అంతేకాకుండా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం రోజే నెలకు రూ.1000కి పెంచారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, గీత కార్మికుల తదితరులకు లబ్ది చేకూరనుంది. రానున్న కాలంలో ఇంకెన్ని వరాలు అందుబాటులోకి రానున్నాయి చూడాలి.

అయితే ఈ విషయం మీద కూడా విమర్శకులు తిరగబడుతున్నారు. కేవలం ఎన్నికల్లో విజయం సాదించుదామనే ఆలోచనతోనే ముందుగానే ఇలా ఫించన్లను పెంచి ప్రజలను మభ్యపెడుతున్నారని, తెలంగాణ సీఎం కెసిఆర్ లా చేద్దామనుకుంటున్నాడుకాని అవన్నీ ఇక్కడ సాధ్యపడని రిటర్న్ కౌంటర్ ఇస్తున్నారు.