ఓడ‌లు బ‌ళ్లు బ‌ళ్లు ఓడ‌ల‌య్యాయి! -జ‌గ‌ప‌తిబాబు

Friday, May 11th, 2018, 02:22:14 AM IST


ఎవ‌రి లైఫ్‌లో అయినా ఒక్కోసారి అనుకున్న‌దొక్క‌టి .. అయినదొక్క‌టి అన్న చందంగా ఉంటుంది. అలాంటి స‌న్నివేశ‌మే జ‌గ‌ప‌తిబాబు- ర‌వితేజ విష‌యంలోనూ నిజ‌మైంది. ఆ ఇద్ద‌రూ కెరీర్ ఆరంభం ఓ చిత్రంలో న‌టించారు. అయితే అందులో ఒకరు హీరో, ఇంకొక‌రు క్యారెక్ట‌ర్ ఆర్టిస్టు. అప్ప‌టికి ర‌వితేజ క్యారెక్ట‌ర్ న‌టుడు మాత్ర‌మే. ఆ త‌ర‌వాత ఆ హీరో జ‌గ‌ప‌తిబాబునే మించిపోయాడు. ఇదే విష‌యాన్ని నేల టిక్కెట్ ఆడియోలో జ‌గ‌ప‌తిబాబు స్వ‌యంగా చెప్పాడు.

జ‌గ‌ప‌తిబాబు మాట్లాడుతూ-“క్యారెక్ట‌ర్స్ చేసి చేసి చివ‌రికి ముదిరిపోతున్నా. బ్యాడ్ అవ్వ‌క‌పోతే చాలు. చిరంజీవి గారికి 10ఏళ్ల క్రితమే చెప్పాను. ప‌వ‌న్ వ్య‌క్తిగా నాకు చాలా ఇష్టం ప‌వ‌న్ క‌ల్యాణ్ అంటే. పొగ‌డ్త కోసం కాదు.. చిరంజీవి గారినే అడ‌గండి. ర‌వితేజ – నేను క‌లిసి `బ‌డ్జెట్ ప‌ద్మ‌నాభం` అనే ఓ సినిమా చేశాం. అప్పుడు ర‌విత‌జ క్యారెక్ట‌ర్ ఆర్టిస్టు .. నేను హీరో, ఇప్పుడు నేను క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌.. ర‌వితేజ హీరో … నేల టిక్కెట్ అన్ని వ‌ర్గాల‌కు న‌చ్చే సినిమా. క‌ళ్యాణ్ కృష్ణ మూడో హిట్ ఇవ్వ‌బోతున్నారు. నిర్మాత రామ్ ప్యాష‌న్ కోస‌మైన హిట్ట‌వ్వాలి“ అన్నారు. అవును నిజ‌మే… బ‌ళ్లు ఓడ‌ల‌వుతాయి… ఓడ‌లు బ‌ళ్ల‌వుతాయి!!

Comments