ఓ చిన్న ప్రశ్నే సర్వేకు దారితీసింది

Monday, September 15th, 2014, 12:02:07 PM IST


ఎట్టకేలకు ముఖ్యమంత్రి కెసిఆర్ ఆగష్టు 19న తెలంగాణలో సమగ్ర సర్వే చేపట్టడానికి గల కారణాలను బయటపెట్టారు.ప్లానింగ్ కమిషన్ అడిగిన ఓ చిన్న ప్రశ్నకు తన దగ్గర సమాధానం లేకపోవడంతో.. అసలు ఎందుకిలా జరిగిందో తెలుసుకుందుకు సమగ్ర కుటుంబ సర్వే చేపట్టినట్టు కెసిఆర్ తెలియజేశారు.
తెలంగాణలో వికలాంగులు ఎక్కువ సంఖ్యలో ఎందుకు ఉన్నారని ప్లానింగ్ కమిషన్ కెసిఆర్ ను అడిగిందట. దానికి ముఖ్యమంత్రి కెసిఆర్ దగ్గర సమాదానం లేకపోవడంతో నామోషీగా పీలయ్యారట. వెంటనే.. ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డుల విషయంలో బోగస్ కార్డులను ఎత్తివేయాలని నిర్ణయించుకున్నారు. ఉన్నాతాధికారుల సమావేశం నిర్వహించి.. సర్వే చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. అలా మొదలైనదే..ఈ సమగ్ర కుటుంబ సర్వే..

అయితే, ఈ సమగ్ర కుటుంబ సర్వే.. మంచి ఫలితాలను ఇవ్వడంతో.. ఇప్పుడు కెసిఆర్ మరికొన్ని సర్వేలను నిర్వహించేందుకు సిద్దమయ్యారని తెలుస్తున్నది. ఇప్పటికే, భూ సమగ్ర సర్వే నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దమవుతున్నది. ఇవే కాకుండా మరికొన్ని సర్వేలను నిర్వహించే, ప్రభుత్వ పధకాలు అర్హులైన వారికి అందేలా చూడాలని కెసిఆర్ ప్రధాన ఉద్దేశ్యం..