ఫేస్ బుక్ ప్రేమలో మునిగి మోసపోయిన టీచర్…

Friday, November 9th, 2018, 10:00:08 PM IST

పిల్లలకి చదువు చెప్పుతూ, వారికీ జ్ఞానాన్ని అందించాల్సిన ఒక టీచర్, వేరే ఒకరి మాయలో పడి, అతడిని గుడ్డిగా నమ్మి, గోరంగా మోసపోయింది. ఆ సదరు యువకుడు టీచర్ కి మత్తుమందిచ్చి ఆమెపై అత్యాచారం చేసి, ఆమె వద్ద ఉన్న బంగారం, నగదు దోచుకుని పరారయ్యాడు. కోయంబత్తూరుకు చెందిన మహిళ ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు. భర్తతో విభేదాలొచ్చి కొంత కాలంగా ఒంటరిగా నివసిస్తోంది. మదురై జిల్లాకు చెందిన రాజప్రవీణ్‌ తో ఏడాది కిందట ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం ఏర్పడి, ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ నెల 7వ తేదీన రాజప్రవీణ్‌ కోయంబత్తూరుకు వచ్చి ఆమెను చిన్న పాళయంలోని హోటల్‌కు తీసుకెళ్లాడు. మధుమేహం నివారణ కోసం ఆమె వెంటతెచ్చుకున్న మాత్రల్లో అతడు మత్తుమందు కలిపాడు. ఆమె స్పృహ తప్పగానే అత్యాచారం చేసి ఆ దృశ్యాలను వీడియోగా చిత్రీకరించాడు. స్పృహలోకి వచ్చాక ఆమెకు ఆ దృశ్యాలను చూపాడు. దీంతో ఆమె తనను పెళ్లి చేసుకోవాలని కోరగా, అతడు నిరాకరించడంతో పాటు రూ.2 లక్షలు ఇవ్వాలని ఒత్తిడి చేసి, 4 తులాల బంగారు నగలు, చెక్‌బుక్, రూ.లక్ష నగదు తీసుకుని పారిపోయాడు. మోసపోయానని గ్రహించిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments