రవిప్రకాష్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు – పోలీసులు గుట్టు రట్టు చూశారుగా…

Saturday, May 18th, 2019, 12:32:31 AM IST

తెలంగాణ పోలీసులు ఎట్టకేలకు టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ ని అరెస్టు చేయడానికి రంగంసిద్ధంచేసుకున్నారు… పోలీసులు పంపించినటువంటి నోటీసులకు రవిప్రకాష్ నుండి ఎలాంటి స్పందన రాకపోగా, మరొక 10 రోజులు గడువు కావాలని తన మెయిల్ ద్వారా కోరారు… కాగా ఇంకా ఎలాంటి గడువులు ఉండవని, ఈసారి తప్పకుండ అరెస్టు చేస్తామని పోలీసులు అంటున్నారు. ఇప్పటివరకున్న కేసులే కాకుండా రవిప్రకాష్ మీద మరొక కేసు నమోదు చేశారు సైబరాబాద్ పోలీసులు… రవిప్రకాష్ పంపిన ఈమెయిల్స్‌లో గుట్టును తెలంగాణ పోలీసులు బహిర్గతం చేశారు…

కాగా తాజా ఈ-మెయిల్‌ సందేశాల ఆధారాలతోనే రవిప్రకాశ్‌కు 41-ఎ సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీ చేసినట్లు సైబరాబాద్‌ పోలీస్‌ అధికారులు తెలిపారు. అయితే ఇప్పటివరకు కూడా రవిప్రకాష్ నుండి ఎలాంటి స్పందన రానందున కోర్టు వారెంటు తో ఎప్పుడైనా అరెస్టు చేస్తామని, ఆ అధికారం ఆత్మకు ఉందని పోలీసులు అంటున్నారు. అయితే కొత్త ఛార్జ్ యిసుకున్నటువంటి మీడియా సంస్థకు పరోక్షంగా ఇబ్బందులు సృష్టించాలని ఉద్దేశంతో రవిప్రకాశ్‌, శివాజీలు పక్కా ప్రణాళిక ప్రకారమే కుట్రలు పన్నుతున్నారని ఆధారాలు కూడా లభ్యమయ్యాయి…

అయితే తనకు చాలా ఇబ్బందులు ఉన్నాయని, అందువల్లనే తనకు ఇంకొక 10 రోజుల గడువు కావాలని రవిప్రకాష్ తన మెయిల్ ద్వారా దర్యాప్తు అధికారులను కోరారని సమాచారం. తన వ్యక్తిగత కారణాలవల్ల వచ్చిన ఇబ్బందులు పూర్తయ్యాక దర్యాప్తునకు హాజరు అవుతానని రవిప్రకాష్ కోరారు. అంతేకాకుండా ఈ కేసులో ఇరుకున్నటువంటి మరో నేరస్తుడు సినీ నటుడు శివాజీ కి ఆరోగ్యం బాగాలేదని, అందువల్లే విచారణకు హాజరు కాలేకపోతున్నాడే తప్ప ఎలాంటి అజ్ఞాతవాసం చేయడం లేదని అందుకోసం కూడా గడువు కావాలని మెయిల్ ద్వారా కోరారు… కాగా రవిప్రకాష్ పంపినటువంటి ఈ-మెయిల్‌ సందేశాల ఐపీ అడ్ర్‌సల ద్వారా ఆచూకీ కనుక్కొనే పనిలో పడ్డారు మన సైబరాబాద్ పోలీసులు.