మొన్న టిఆర్ఎస్ నేడు మరొక ప్రధాన పార్టీ : జమిలికి సై

Tuesday, July 10th, 2018, 07:46:48 PM IST

దేశంలోని వస్తువుల, సేవ పన్నుల విషయమై ఇప్పటికే ఒకే దేశం ఒకే పన్ను విధానాన్ని జీఎస్టీ లో తీసుకువచ్చిన మోడీ ప్రభుత్వం త్వరలో ఇదేవిధంగా జమిలి ఎన్నికలకు సిద్దమౌవుతున్నట్లు తెలుస్తోంది. ఒక దేశంలో శాసనసభ మరియు లోక్ సభకు ఎన్నికలు ఒకే సారి నిర్వహించే పద్దితిని జమిలి అంటారు. అయితే ఇప్పటికే ఈ తరహా ఎన్నికలకు తాము సిద్ధమని ప్రకటించింది తెలంగాణలోని టిఆర్ఎస్ పార్టీ. ఇక నేడు వైసిపి పార్టీ కూడా తాము జమిలికి రెడీ అని ప్రకటన విడుదల చేసింది. నేడు ఆ పార్టీ అధికార ప్రతినిధి మరియు ఎంపీ విజయ్ సాయి రెడ్డి, మరియు మరొక నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు నేడు విలేఖర్ల సమావేశంలో తెలియచేసారు. ఈ విషయమై ఇప్పటికే లా కమీషన్ తో సుదీర్ఘంగా చర్చలు జరిపామని, ప్రజల అభివృద్ధి, మరియు సంక్షేమం దృష్ట్యా తాము ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పార్టీ తరపున విజయ్ సాయి రెడ్డి తెలిపారు.

అయితే ఒకరకంగా జమిలి ఎన్నికలతో ప్రధానంగా జాతీయ పార్టీలకు అధిక లాభం చేకూరుతుందని, అయితే ప్రాంతీయ పార్టీల పై కూడా ఆ పార్టీల వారు కాస్త దృష్టి కేంద్రీకరించాలని, ఈ సందర్భంగా అయన విజ్ఞప్తి చేసారు. ఒకవేళ ముందుగా లోక్ సభ లేదా అసెంబ్లీ రద్దయితే ఏమి చేస్తారని లా కమీషన్ ను ప్రశ్నించామని, దానికి వారు రద్దయిన కాలానికి మాత్రమే ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని వారు సమాధానమించినట్లు తెలిపారు. ఒకరకంగా ఈ జమిలి ఎన్నికల వల్ల ఖర్చు, అవినీతి, ఓటర్లకు డబ్బు పంపకం వంటివి కొంతవరకైనా నిరోధించవచ్చని అయన తెలిపారు. అయితే ఇటువంటి జమిలి ఎన్నికలు మనకు కొత్తేమి కాదు, గత 2004 నుండి 2014 వరకు కూడా మనకు జరుగుతూనే వస్తున్నాయి కదా అని అన్నారు……

  •  
  •  
  •  
  •  

Comments