షాకింగ్ న్యూస్ : ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్స్ కన్నుమూత!

Wednesday, March 14th, 2018, 09:56:49 AM IST

ప్రపంచం ఓ అనంత జ్ఞానాన్ని కోల్పోయింది. ఖగోళ శాస్త్రంలో ఎన్నో ఫార్ములాలను తనదైన శైలిలో వ్యక్తపరిచిన ప్రసిద్ధ సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్స్ కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు. 76 సంవత్సరాలు ఉన్న స్టీఫెన్ గత కొన్నేళ్లుగా పార్కిన్ సన్ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. మాట్లాడలేని కదల్లేని స్టీపెన్ కోసం అత్యాధునిక టెక్నాలిజీతో ఒక వీల్ చెయిర్ ని తాయారు చేశారు.

అందులోనే గత 50 ఏళ్లకు పైగా జీవితాన్ని గడిపాడు. కేవలం కంప్యూటర్ ద్వారా తన సంకేతాలను అందించేవాడు. ఖగోళ శాస్త్రంలో ఆయన ఎన్నో కొత్త తరహా విషయాలను బయటపెట్టారు. ఇతర గ్రహాలకు మానవుడు చేరుకోగలడని మరో 15 ఏళ్లలో ప్రయాణాలు సిద్దమవుతాయని అప్పట్లో తన భావనను తెలియజేశారు. అంగారక గ్రహాన్ని చేరుకోగలుగుతారని స్టీపెన్ విశ్వాసం వ్యక్తం చేశాడు. ఎందుకంటే ప్రపంచం లో మరో 200 ఏళ్లలో కొన్ని ప్రమాదాలు ఏర్పడవచ్చని హెచ్చరించాడు.