టీడీపీ నేతపై జరుగుతున్న ఐటీ దాడుల్లో జగన్,విజయ్ సాయి రెడ్డిల హస్తం ఉందంట?

Friday, October 12th, 2018, 01:58:33 PM IST

గత కొన్ని రోజుల క్రితం తెలంగాణలోని రేవంత్ రెడ్డి ఆస్తులపై ఐటీ అధికారులు నిర్వహించిన దాడులు సంచలనంగా మారింది.దానికి తోడు ఆ కొద్దీ రోజుల వ్యవధిలోనే ఆంధ్రప్రదేశ్ లోను ఐటీ దాడులు నిర్వహిండం అందులోను కేవలం టీడీపీ ఎమ్మెల్యేలు,ఎంపీలు మరియు మాజీ నేతలపై దాడులు చెయ్యడం మరింత సంచలనానికి దారి తీసింది.ఇప్పుడు మళ్ళీ తాజాగా టీడీపీ ఎంపీ సీఎం రమేష్ యొక్క ఆస్తులపైనా అకస్మాత్తు దాడులు చెయ్యడంతో ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర దుమారం చెలరేగింది.

టీడీపీ నేతలపై జరుగుతున్నటువంటి ఈ ఐటీ దాడులన్నీ కేంద్ర ప్రభుత్వం కావాలనే కక్ష సాధింపు చర్యగా నిర్వహిస్తున్నాయని,టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.తనపై జరుగుతున్న ఐటీ దాడులపై సీఎం రమేష్ మాట్లాడుతూ ఇక్కడ వైసీపీ పార్టీ అధినేత వై ఎస్ జగన్ మరియు అతని సహచరుడు విజయ్ సాయి రెడ్డిలు ఇద్దరు కేంద్రంతో కుమ్మక్కయ్యిపోయి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి తెలుగుదేశం నాయకుల మీద కావాలనే కుట్ర పూరితంగా ఇలాంటి చర్యలకు పాల్పడుతన్నారని రమేష్ తెలియజేసారు.వారు కేంద్రంతో కలిసి ఎన్ని డ్రామాలు ఆడినా తాను భయపడనని,కాకపోతే కావాలనే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడటం ఎంత వరకు న్యాయమని,ప్రశ్నించారు.