మూల్యం చెల్లించలేని విషాదం..! కడుపు తరుక్కుపోయే సంఘటన.

Wednesday, September 12th, 2018, 10:08:26 AM IST

ఆర్టీసీ బస్సు ప్రమాద చరిత్రలోనే ఇదొక విషాద ఘట్టం. మునుపెన్నడూ ఇలాంటి సంఘటన జరగలేదు ఇక ముందు ఎప్పుడు ఇలాంటి సంఘటన జరగకూడదు. ఎన్నో ప్రాణాలు, ఏం జరుగుతోందో తెలిసే లోపే కథ విషాదాంతం. ప్రతి ఒక్కరి కుటుంబ సభ్యులు వారి ఇంట్లో ఎదురు చూస్తూ పడిగాపులు కాసి ఉంటారు. మా భర్త ఇంటికి వచ్చేస్తాడు అని భార్య, మా అమ్మ బయటకు వెళ్ళింది నాకు ఏమైనా తెస్తుంది అని ఇంట్లో ఎదురు చూసే పిల్లలు, ఆలయ సందర్శనానికి వెళ్లిన భక్తులు, క్షణాల్లో కంటికి చిక్కని, వెళ్లగక్కుకోలేని దుర్ఘటన. ఇదంతా కేవలం ఒక్క డ్రైవర్ నిర్లక్ష్యం అనుకోవాలా లేక బస్సు యొక్క స్థాయిని మించి జనాన్ని ఎక్కించిన కండెక్టర్ ని నిందించాలా..? లేక ఎదురుగా వచ్చిన మినీ వాన్ డ్రైవర్ తప్పు అనాలా..? తప్పు ఎవరిదీ అని చెప్పలేం ఎన్నో ఇతర కారణాలు ఉండొచ్చు.

కానీ కంటి చివర వరకు వచ్చి ఆగిపోయిన కన్నీరుని ఆపలేం అలాంటి సంఘటన జరిగిపోయింది. 20 అడుగుల లోతులో పడిపోయిన బస్సు 58 మంది ప్రాణాలు, వైద్యం కోసం తీసుకెళ్తుండగానే మధ్యలోనే ఆగిపోయిన ఊపిరి, కొన ఊపిరితో ఉన్నాం మమ్మల్ని బ్రతికించండి అంటున్న క్షత గాత్రులతో నిన్న కొండగట్టు లోయలో జరిగిన విషాద అంశం, నిస్సహాయ స్థితిలో ప్రయాణీకులు, రక్తపు మడుగులో ఉన్నారు, అందులో ఐదుగురు చిన్నారులు కూడా ఉన్నారు పాపం వారికేం తెలుసు వారు చనిపోతున్నారు అని అంతా కన్ను మూసి తెరిచేలోగా జరిగిపోయింది.

మృతి చెందిన ప్రతి ఒక్కరికి యావత్ దేశమంతా వారి ప్రధాని నరేంద్ర మోడీ సహా వారి ప్రగాఢ సానుభూతి తెలిపారు, ముఖ్యమంత్రి కెసిఆర్ మంత్రి కేటీఆర్, ఎంపీ కవిత తదితరులు సంఘటనా స్థలానికి చేరి క్షతగాత్రులను పరామర్శించారు. మరణించిన వారికి ప్రభుత్వం తరఫున 5 లక్షలు ఆర్టీసీ వారి తరపున 3 లక్షలు పరిహారమందిస్తాం అని తెలిపారు. మృతి చెందిన వారిలో ఒకవేళ రైతులు ఉన్నట్లయితే వారికి రైతు భీమా అందజేస్తాం అని మహేందర్ రెడ్డి మరియు మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రతి ఒక్కరు వారు ఎవరైనా వారి సంబంధిత వృత్తిని భాద్యతతో నిబద్ధతత, శ్రద్ధతో చేసి ఉంటె ఇలాంటి జీర్ణించుకోలేని సంఘటన జరగకుండా ఉండేది.

  •  
  •  
  •  
  •  

Comments