“జనసేన” శ్రేణులకు కనబడుతున్న రెండు ఆప్షన్స్ ఇవే..!

Thursday, May 16th, 2019, 11:50:18 AM IST

ఏపీ రాజకీయ వర్గాల్లో మూడో బలమైన పార్టీగా అవతరించి నిలదొక్కుకున్న పార్టీ ఏదన్నా ఉంది అంటే అది పవన్ కళ్యాణ్ స్థాపించిన “జనసేన” పార్టీయే అని చెప్పాలి.సినీ రంగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ వైపే ఇప్పుడు ఏపీ ప్రజల యొక్క దృష్టి అంతా ఉంది.పవన్ ను తక్కువ అంచనా వేసేందుకు లేదని గతంలో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచినప్పుడే లెక్కలు అన్ని మార్చేశారు.ఈసారి ఏకంగా పోటీలోకి దిగారు.దీనితో పవన్ ఎన్ని స్థానాలు గెలుచుకుంటారు?అతని వల్ల ఎవరికి నష్టం కలుగుతుంది? లేదా పవనే నష్టపోతారా అన్నది ఇంకొన్ని రోజుల్లోనే తేలిపోనుంది.

అయితే పవన్ గెలవబోయే స్థానాల లెక్కలో పవన్ అభిమానులు ముందు రెండే ఆప్షన్లు కనిపిస్తున్నాయని అనిపిస్తుంది.అనేక సర్వేలలో పవన్ కు కేవలం రెండు స్థానాలు మాత్రమే కేటాయిస్తున్నారు.మరికొన్ని సర్వేలలో అయితే అసలు పవన్ కు ఇవ్వడమే లేదు.దీనితో పవన్ ప్రభావాన్ని తక్కువ అంచనా వేస్తున్నారని జనసేన శ్రేణులు ఈ సర్వే లెక్కలు అన్నిటిని కొట్టి పారేస్తున్నారు.అయితే పవన్ కొడితే ఎవ్వరూ ఊహించని రీతిలో విజయం లేదా ఇతర పార్టీలు అనుకుంటున్న విధంగా ఘోరమైన పరాజయం ఈ రెండిటి మధ్యలోనే పవన్ ఉన్నారని జనసేన శ్రేణులు భావిస్తున్నారు.మరి పవన్ ఎలాంటి ప్రభావాన్ని ఈ రెండు పార్టీలపైనా చూపిస్తారో చూడాలి మరి.