అక్కడ ప్రేమను, ప్రేమ పెళ్ళిళ్ళను బహిష్కరించారు!

Thursday, May 3rd, 2018, 04:44:52 PM IST

యువతీ యువకులు యుక్తవయసుకు వచ్చాక ప్రేమించుకోవడం సహజమే. అలా ప్రేమించుకున్న కొందరు మాత్రం అందరిని ఒప్పించి పెళ్లి చేసుకుంటే, మరికొందరేమో తల్లితండ్రులు ఒప్పుకోక, బయటకు వెళ్లి పెళ్లిళ్లు చేసుకునేవారున్నారు. అయితే ఇటీవల పంజాబ్ లోని ఒక గ్రామం వారు ఏకంగా ప్రేమని, ప్రేమ పెళ్లిళ్లు చేసుకునే వారిని సామజిక బహిష్కరణ చేయనున్నట్లు ప్రకటించారు. పంజాబ్, లుథియానా జిల్లాలోని చాన్ కోయిన్ గ్రామం వారు ఈ విధమైన నిర్ణయం తీసుకున్నారు. తమని, తమ నిర్ణయాన్ని ఎదిరించి ఎవరైనా యువతీ యువకులు ఇలా ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటే వారికి వూళ్ళో వాళ్ళు ఎవరు ఏవిధంగానూ సహకరించారని, అంతే కాదు వారింట్లో శుభ, అశుభాలకు ఎవరు వెళ్లరాదని కఠినమైన నిర్ణయం తీసుకున్నారు.

అంతే కాదు ఇదేమి తప్పుకాదని గ్రామ పంచాయితీ సభ్యుల అంటున్నారు. ఇటీవల గత నెలలో ఒక జంట కులాంతర వివాహం చేసుకున్నారని, అటువంటివాటిని సహించలేకపోయింది మిగతా గ్రామస్థులు ఇకపై కులాంతర వివాహాలు చేసుకోవడం కుదరదని మొన్న జరిగిన గ్రామా పంచాయితీ సమావేశంలో తేల్చారు. అయితే ఈ విషయమై అక్కడి అధికారులను ప్రశ్నించగా అటువంటివి తమ దాకా రాలేదని, అయినా నాగరిక సమాజంలో బహిష్కరణ నేరమని, అటువంటివి చేస్తే వారిపై చట్టపరంగా కేసు లు పెడతామని అంటున్నారు……

Comments