అక్కడ టిఆర్ఎస్ విజయం అనుమానమే !

Thursday, January 18th, 2018, 02:50:03 AM IST

టిఆర్ఎస్ కంచుకోట గా చెప్పుకునే పాత వరంగల్ నియోజక వర్గం లో ఈ సారి అధికార పార్టీ విజయం కష్టమనే సంకేతాలు అందుతున్నాయి. 2019 ఎన్నికలే ద్యేయంగా తన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు దూసుకెళ్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ సారి కూడా తమ పార్టీ విజయ ఢంకా మ్రోగించేలా ఆపరేషన్ ఆకర్ష్ తో ఇతర పార్టీల నేతలను తమ పార్టీ లోకి ఆహ్వానిస్తున్నారు. అక్కడి ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే ఉమ్మడి వరంగల్ లో వున్న ఆరు స్థానాల్లో కాంగ్రెస్ దే పైచేయిగా ఉండేలా వుంది, కానీ పార్టీ ని ముందుకు నడిపి విజయతీరాలకు చేర్చే నాయకుడు కరువయ్యాడు అని తెలుస్తోంది. కానీ క్యాడర్ లో ఉత్తేజం నింపి, ప్రజల్లో నమ్మకం పెంచే లీడర్ కావలి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ నాయకుడి కొరతతో ఇటువంటి పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఆందోళన కలిగిస్తున్నాయని అంటున్నారు. ఉమ్మడిగా వున్న వరంగల్ లోని మానుకోట, డోర్నకల్, ములుగు, భూపాలపల్లి, జనగామ నియోజకవర్గాల్లో ఈసారి కాంగ్రెస్ పార్టీ కి మంచి విజయావకాశాలు కనిపిస్తున్నాయని తెలుస్తోంది. ఈ పరిస్థితులు కేవలం టిఆర్ఎస్ పార్టీ ఎంఎల్ఏ ల పనితీరు వల్ల ఏర్పడ్డాయంటున్నారు. ఈ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ల పై అక్కడి ప్రజలు, టిఆర్ఎస్ శ్రేణుల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్లు కొన్ని వర్గాల సమాచారం. అయితే ఈ పరిస్థితులని తమకు అనుకూలంగా మార్చుకుని ప్రజల్లోకి వెళ్లే నాయకుడు కాంగ్రెస్ లో కరువయ్యారు. జనగామ యం ఎల్ ఏ ముత్తిరెడ్డికి, భూపాలపల్లి యం యల్ ఏ స్పీకర్ మధుసూధనాచారికి, ములుగు యం యల్ ఏ మంత్రి చందు లాల్ కి, మానుకోట యం ఎల్ ఏ శంకర్ నాయక్ కి వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ముఖ్యమంత్రి కె సి ఆర్ సీట్ ఇచ్చే అవకాశం లేదని అక్కడి టి ఆర్ ఎస్ శ్రేణులు, ప్రజలు చెప్పుకుంటున్నట్లు సమాచారం. అయితే ఈ నియోజకవర్గాలపై కాంగ్రెస్ పార్టీ సరైన దృష్టి పెట్టి మంచి నాయకుడిని ఎన్నుకుని పోటీ చేయిస్తే గెలుపు ఖాయమని అంటున్నారు, కానీ కాంగ్రెస్ ఏ విధంగా వ్యవహరిస్తుందో వేచి చూడాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు….

  •  
  •  
  •  
  •  

Comments