400 ఏళ్లుగా ఓ మూఢ నమ్మకం.. అక్కడ జన్మనివ్వకుడదట!

Sunday, May 13th, 2018, 09:20:48 AM IST


కాలం ఎంత మారుతున్నా ఇంకా మనిషిలో ఎదో ఒక మూఢ నమ్మకం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ముఖ్యంగా గ్రామాల్లో ఎంత మాత్రం మూఢ నమ్మకాలు తగ్గడం లేదు. ఓ గ్రామంలో అయితే 400 ఏళ్లుగా అదే తరహాలో కంటిన్యూ అవుతుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఎందుకంటే అక్కడ అత్యవసర సమయంలో గర్భిణీ కి నొప్పులు వస్తే గ్రామం నుంచి వెంటనే తరలించాల్సిందే. ఆలస్యం అయినా సరే ఆ ఊర్లో ఏ గర్భిణీ పురుడు పోసుకోకూడదు. ఇది నాలుగు వందల ఏళ్లుగా సాగుతున్న నిజం.

అసలు మ్యాటర్ లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌కు దాదాపు 100 కి.మీ సమీపంలో ఉన్న రాజ్‌గర్‌ – శంక శ్యామ్‌జీ గ్రామానికి 400 ఏళ్ల కిందట దేవుళ్లు ఒక శాపం ఇచ్చారట. అక్కడ ఒక గుడిని నిర్మిస్తుండగా ఓ ఇంటి మహిళ గోధుమలతో పిండి పట్టించడంతో పని చేసే వారికి అంతరాయం కలిగిందట. అంతే.. దేవుళ్లు అక్కడి వారికి పెద్ద శాపం పెట్టారట. ఏ గర్భిణీ ఇక్కడ పురుడు పోసుకోవద్దని చెప్పడంతో అప్పటి నుంచి తరా తరాల కుటుంబాలు అదే ఫాలో అవుతున్నాయి. ఒకవేళ పొరపాటున ఏ స్త్రీ అయినా బిడ్డకు జన్మనిస్తే వారు అవిటితనంతో గాని లేక చనిపోవడం.. ఎదో ఒకటి జరుగుతుందని అక్కడి వారు చాలా గట్టిగా నమ్ముతున్నారని గ్రామా సర్పంచ్ చెబుతున్నాడు. ఇక పురుడు కోసం గ్రామం పోలి మేరలో ప్రత్యేకంగా స్థావరాన్ని గ్రామస్థులు ఏర్పాటు చేసుకున్నారు.

Comments