అక్కడ మాకు డిపాజిట్లు కూడా రావేమో : టిడిపి నేత

Wednesday, April 25th, 2018, 09:09:11 AM IST

టీడీపీ కి మంచి పట్టుగా వున్న కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజక వర్గంలో ప్రస్తుతం టీడీపీ పట్టుకోల్పోయే పరిస్థితి వచ్చిందా అంటే, అవును అనే అంటున్నారు కొందరు ఆ పార్టీ నేతలు. దీనికి ప్రధాన కారణం టీడీపీ ఏపీ టూరిజం సఖ మంత్రి అఖిల ప్రియా, అలానే అక్కడి టీడీపీ నేత ఏవి సుబ్బారెడ్డిల మధ్య విబేధాలు తలెత్తడమే అని తెలుస్తోంది. మొన్నటివరకు మతాల వరకు వెళ్లిన వీరి మధ్య పోరు, ప్రస్తుతం ఒకరిపై మరొకరు దాడులు చేయించుకునేదాకా చేరింది. ఒకప్పుడు భూమా నాగిరెడ్డికి మంచి అనుచరుడిగా వున్నా సుబ్బ రెడ్డి ఆయన మరణాంతరం బయటకి వచ్చి విడిగా తాను టీడీపీ తరపున పని చేస్తున్నారు.

అయితే ఆయన మొన్న ఆదివారం ఆళ్లగడ్డ మండలం కోటకందుకూరులో తన అనుచరులతో కలిసి సైకిల్ యాత్ర చేస్తుండగా కొందరు దుండగులు రాళ్ళ దాడి చేశారు. ఈ దాడిలో పలువురికి గాయలయ్యాయి. అయితే ఈ ఘటన పై సుబ్బారెడ్డి ఆళ్లగడ్డ డిఎస్పీ కి ఫిర్యాదు చేసారు. కాగా దీనిపై మంత్రి అఖిల ప్రియ మాట్లాడుతూ, తమకు ఎవరిపైన దాడి చేయించవలసిన అవసరం లేదని, తాము అంత నీచమైన స్థితికి దిగజారలేదని అన్నారు. కాగా నేడు ఆళ్లగడ్డ మాజీ టిడిపి ఇంచార్జి ఇరిగేలా రాంపుల్లారెడ్డి మాట్లాడుతూ ఇలా మనలోనే ఒక వర్గం పై మరొకరు దాడిచేయడం సరైనది కాదని దీనివల్ల పార్టీ ప్రతిష్ట మసకబారి,

మనకి భవిష్యత్తులో డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థి కూడా ఉండదని, అది గుర్తుపెట్టుకుని ముందుకు నడవాలని హిత బోధ చేశారు. అయితే ఈ తాజా ఘటనల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇరువర్గాలతో నిన్న భేటీ కావలసి ఉండగా, కొన్ని కారణాల వల్ల భేటీ వాయిదా పడినట్లు తెలుస్తోంది. కాగా పలువురు టీడీపీ నేతలు వీలైనంత త్వరగా చంద్రబాబు జోక్యం చేసుకుని ఇరువర్గాల మధ్య సయోధ్య కుదర్చాలని అంటున్నారు……

  •  
  •  
  •  
  •  

Comments