పురుషులకూ రక్షణ కమీషన్ ఉండాలి : నన్నపనేని

Wednesday, May 30th, 2018, 09:00:31 PM IST


గత కొద్దిరోజుల క్రితం విజయనగరం జిల్లాలో సొంత బావను పెళ్లి చేసుకున్న యువతి, అతని పై అఇష్టంతో ప్రియుడుతో కలిసి ఒక కిరాయిహంతకుల ముఠాకు సుపారీ ఇచ్చి అతికిరాతకంగా హత్య చేయించిన ఉదంతం అందరికి గుర్తు వుండే ఉంటుంది. తొలుత అది దోపిడీ దొంగల పని నమ్మించిన ఆ యువతీ, తరువాత పోలీస్ ల విచారణలో నిజం ఒప్పుకుంది. ఇక మూడు రోజుల క్రితం సంతబొమ్మాళిలో మరొక యువతీ పెళ్లి అయి కేవలం పది రోజులు అయినా కాలేదు, తనకు భర్త అంటే ఇష్టం లేదని, అయినప్పటికీ తనకు అతన్ని ఇచ్చి పెళ్లి చేశారనే అక్కసుతో బైక్ పై వెళ్తున్న భర్త గొంతు కోసి హత్యా ప్రయత్నం చేసింది.

ఇటువంటి ఘటనలు తనను ఎంతో కలచి వేశాయని ఏపీ టీడీపీ మహిళా కమీషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. ఇటీవల రాష్ట్రంలో మహిళలపైనే కాక ఉత్తరాంధ్రలో భర్తల పై భార్యలు అమానుషంగా దాడి చేయడం తనకు బాధ కలిగించిందని, నిజానికి ఇటువంటి ఘటనలు జరగడానికి ప్రధాన కారణం నేటి టివి చానెల్స్ లో వస్తున్న సీరియల్స్ అని ఆమె అన్నారు. ఇప్పుడు ఏ ఛానల్ లో సీరియల్ చూసినా మహిళలను హింస ప్రవృత్తిని ప్రేరేపించేవారుగా చూపిస్తున్నారని, ఒకప్పుడు కొన్ని సీరియల్స్ లో మహిళలను మంచి మనసున్నవారుగా చూపించే వారుగా చూపించేవారని, నేడు ఈ సీరియల్స్ వల్ల ఆడవారి మనస్తత్వాల్లో కూడా మార్పులు వచ్చి, వారు హింసను ప్రేరేపించేవారుగా తయారయి అలా భర్తలపై దాడులు చేస్తున్నారని అన్నారు. అందువల్ల సినిమాల వలే సీరియల్స్ కు కూడా ఒక సెన్సార్ ఉండాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు.

నిజానికి తాను ఎప్పటినుండో ఈ డిమాండ్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుండి సరైన స్పందన రాలేదని నన్నపనేని అంటున్నారు. కాగా భార్యల దాడులవల్ల గాయపడ్డ భర్తల వద్దకు తాను త్వరలో వెళ్లి తనవంతు సాయం అందించనున్నట్లు ఆమె తెలిపారు. ఇదే పరిస్థితి రాష్ట్రంలో కొనసాగితే మహిళా కమీషన్ల వలే, త్వరలో పురుషుల రక్షణకు కమీషన్లు ఏర్పాటు చేయవలసి వస్తుందని, ఎక్కడో కొందరు మహిళలు విచక్షణ మరచి చేస్తున్న ఈ దాడుల వల్ల మొత్తం మహిళా లోకానికే చెడ్డపేరు వస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కావున ప్రభుత్వం ఇకనైనా తన విన్నపాన్ని మన్నించి సీరియల్స్ కి కూడా సెన్సార్ ఏర్పాటు చేస్తే ఇటువంటి హింస చాలా వరకు తగ్గుముఖం పడుతుందని ఆమె అంటున్నారు….

  •  
  •  
  •  
  •  

Comments