త్వరలో ఏపీలో వూహించని పరిణామాలు జరగనున్నాయి : బిజెపి నేత

Friday, May 11th, 2018, 08:53:18 PM IST

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాలు ఇంకొద్దిరోజుల్లో మారబోతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేసారు బిజెపి నేత జివిఎల్ నరసింహారావు. కావాలంటే కొద్దిరోజులవరకు వేచి చూడండి అని గురువారం ఢిల్లీ లోని ఏపీ భావన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ప్రభుత్వం ఏకపక్ష ప్రచారం చేసుకుంటోందని, వారి తప్పుడువాదాన్ని తిప్పి కొట్టి త్వరలోనే ప్రజా కోర్ట్ లో నిలబెడతామన్నారు.

పరిశ్రమలు, వ్యవసాయం, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు, ఇలా ఏ రంగంలో చూసినా కూడా ఆ అభివృద్ధి కేవలం రాష్ట్ర ప్రభుత్వం వారే చేశామని చెప్పుకోవడం విడ్డురమన్నారు. కర్ణాటకలో తమను, తమపార్టీని ఓడించేందుకు ఇక్కడి తెలుగువారు బానే కుట్ర చేస్తున్నారని, అందుకు ఉద్యోగులను ఉపయోగించుకుంటున్నారని అన్నారు . అసలే ఎపిలో పాలన గాడి తప్పిందని ఈ సమయంలో ఉద్యోగులను రాజకీయాల్లో దింపడం వల్ల ఏమి ప్రయోజనం ఉంటుందని ఆయన ప్రశ్నించారు.

అంతేకాక కేంద్ర నిధులతో విలాస మొక్కుబడి దీక్షలు, విదేశీ యాత్రలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం వారు ఆ డబ్బును వ్యవసాయానికి ఉపయోగించివుంటే బాగుండేది అని టీపీడీని ఉద్దేశించి అన్నారు. టిడిపి అహంకారం, నియంతృత్వ విధానాలవల్ల బిజెపికి ఏమి నష్టం రాదన్నారు. ప్రభుత్వం అంటే కేవలం ప్రచారం చేయడం కాదనిఇలాంటివి చేస్తే 2004 నాటి పరిస్థితులను రానున్న ఎన్నికల్లో టిడిపి చవిచూడవలసి వస్తుందని హెచ్చరించారు.

తమ పార్టీవారికి టిడిపి మీద ఎటువంటి ద్వేషం లేదని, కాకపోతే టీడీపీ నిరంకుశ విధానాలు, ఆ పార్టీ నాయకుల పై ప్రజలే కక్ష పెంచుకున్నారని, అధినేత చంద్రబాబు ఇది గుర్తించాలని అన్నారు. కేంద్రం పన్ను రాయితీలు ఇవ్వకమానుండు ఎన్ని పరిశ్రమలు నెలకొల్పారు, ఇచ్చాక నెలకోల్పారు వంటి వివరాలను టీడీపీ ప్రజలముందు ఉంచాలి అన్నారు………

  •  
  •  
  •  
  •  

Comments