జనసేన పార్టీ ఓటమికి కారణాలు లోపాలు ఇవే..?!

Sunday, May 26th, 2019, 04:00:51 AM IST

ఏపీ రాజకీయ వర్గాల్లో మూడో బలమైన ప్రత్నామ్యాయంగా మారుతుందనుకున్న జనసేన పార్టీ ఒక్క ఏడాదిలో అనేక మార్పులు తీసుకువచ్చింది.కానీ ఏం లాభం ఊహించిన స్థాయి ఫలితాలను అయితే అందుకోలేకపోయింది.నిజానికి జనసేన పార్టీకి ఇంత తక్కువ స్థాయి ఓట్లు పడతాయని వారు కూడా అనుకోని ఉండరు.అయితే ఈ పార్టీ మొట్టమొదటి సారి పాల్గొన్న ఎన్నికల్లోనే విఫలం కావడానికి గల కారణాలను మరియు లోపాలను రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.ముందుగా పవన్ పార్టీ ఓటమి పాలవ్వడానికి గల కారణాలు గమనించినట్లయితే…

ఈ పార్టీ పెట్టి ఐదేళ్లు అయినా సరే పవన్ అంటే అభిమానం ఉన్న వారిలో తప్ప మరెక్కడా పెద్దగా ఈ పార్టీ ప్రజల్లోకి వెళ్లలేకపోయింది.క్షేత్ర స్థాయి నుంచి ప్రజల్లోకి జనసైనికులు పూర్తి స్థాయిలో తీసుకెళ్లలేకపోయారు.అలాగే ఈ పార్టీకి ఓటమికి గల ప్రధాన కారణం ఆ పార్టీ మ్యానిఫెస్టోను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లలేకపోవడం.ఇది నిజంగా పెద్ద దెబ్బ వేసింది.పవన్ ఎన్నో మంచి మంచి అంశాలను మ్యానిఫెస్టోలో పెట్టినా అది మాత్రం జనంలోకి వెళ్ళలేదు.ముఖ్యంగా పవన్ ప్రారంభించిన “జీరో బడ్జెట్ పాలిటిక్స్”మన దగ్గర మందు డబ్బులు ఇవ్వకపోతే పని జరగదు.ఇప్పుడు ఏపీ ప్రజలు ఎలా ఉన్నారు అంటే డబ్బులు ఎవ్వరు ఇవ్వకపోతే పోలింగ్ బూత్ వరకు వెళ్ళను అనే స్థితిలో ఉన్నారు.చాలా గ్రామాల్లో ఇదే పరిస్థితి దీనితో వీరు డబ్బులు మందు పంచకుండా నీతివంతమైన రాజకీయాలు చేద్దామనుకోవడం మరో పెద్ద తప్పు అయ్యింది……

ఇక లోపాలకు వచినట్టైతే ఈ పార్టీకి మిగతా రెండు పార్టీలతో పోల్చినట్లయితే బలమైన క్యాడర్ లేనే లేదు.దీనిపై పవన్ ఎప్పుడు కూడా దృష్టి పెట్టిన దాఖలాలు కూడా లేవు.తన పని ఏదో చేసుకుంటూ వెళ్లిపోవడం సభలు పెట్టడం తప్ప పార్టీకి సరైన క్యాడర్ ఉందా లేదా అన్నది చూసుకోలేదు.అలాగే గ్రౌండ్ రియాలిటీలో ఏం జరుగుతుందో నిశితంగా తెలుసుకోలేకపోవడం కూడా ఒక లోపమే అని చెప్పాలి.పవన్ కు తెలిసింది.వేరు తెలియాల్సింది వేరు దీనిపై పవన్ ఇంకా లోతుగా అధ్యయనం చెయ్యకపోవడం బాగా దెబ్బ వేసింది.అలాగే పవన్ సినీ నటుడు కావడం వల్ల పూర్తి స్థాయిలో పవన్ ను ప్రజలు నమ్మలేదు.ముఖ్యంగా జనసేన వారు వృద్ధుల నుంచి గ్రామ స్థాయిలో పార్టీను బలోపేతం చేసుకోలేకపోయారు.ఇవన్నీ పవన్ ఈసారి నుంచి అయినా సరి చూసుకుంటే రానున్న రోజుల్లో పవన్ కోరుకున్న మార్పు ప్రతీ ఒక్కరిలో రావొచ్చు.