బుల్లితెర నటి ఝాన్సీ.. ఆత్మహత్య‌కు కార‌ణాలు ఇవే..!

Wednesday, February 6th, 2019, 12:36:28 PM IST

తెలుగు బుల్లితెర న‌టి ఝాన్సీ ఆత్మ‌హ‌త్య టీవీ ప‌రిశ్ర‌మ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపుతోంది. కృష్ణా జిల్లా ముదినేపల్లికి చెందిన ఝాన్సీ కొంత కాలంగా శ్రీన‌గ‌ర్‌కాల‌నీలో త‌న కుటుంబంతో నివాసం ఉంటుంది. తెలుగులో మాటీవీలో ప్రసారమయ్యే పవిత్రబంధం సీరియల్‌తో టీవీ ప్రేక్షకులకు దగ్గరైన ఝాన్సీ.. కొంత‌కాలంగా ప్రేమ‌లో ఉన్న‌ట్టు స‌మాచారం. సూర్య అనే వ్య‌క్తిని ఝాన్సీ ప్రేమిస్తుంద‌ని, దీంతో అత‌ని వ‌ల్లే ఆమె ప్ర‌స్తుతం సీరియ‌ళ్ళు చేయ‌డం మానేసింద‌ని స‌మాచారం.

ఝాన్సీ కుటుంబ స‌భ్యుల ఫిర్యాదు మేర‌కు దర్యాప్తు మొద‌లు పెట్టిన పోలీసులు, ఝాన్సీ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నార‌ని తెలుస్తోంది. ఈ కేసులో సూర్య‌తో ఆమె చేసిన వాట్సప్ చాట్ కీల‌కంగా మారే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. సూర్య‌-ఝాన్సీల ప్రేమ ముదిరి స‌హ‌జీవ‌నం వ‌ర‌కు వెళ్ళింద‌ని, దీంతో త‌న‌ని పెళ్లి చేసుకోమ‌ని సూర్య‌ను బ‌ల‌వంతం పెట్ట‌డంతో ఝాన్సీని సూర్య దూరం పెట్టాడ‌ని తెలుస్తోంది. దీంతో తీవ్రంగా డిప్రెషన్‌కు గురైన ఝాన్సీ, ప్రేమ‌లో విఫ‌ల‌మైనందుకు ఆత్మ‌హ‌త్య చేసుకుంద‌ని చెబుతున్నారు. ఇక ఝాన్సీ మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. పోస్టు మార్టం రిపోర్ట్ వ‌చ్చాక ఎలాంటి విష‌యాలు బ‌య‌ట‌ప‌డ‌తాయో చూడాలి. ఇక‌ ఆమె మరణంపై పలువురు టీవీ నటీనటులు సంతాపం ప్రకటించారు.