జగన్ పై దాడి కేసులో ట్విస్ట్..నన్ను చంపేసి రాజకీయం చెయ్యాలని చూస్తున్నారు..!

Wednesday, October 31st, 2018, 04:01:30 PM IST

జగన్ పై హత్యకు పాల్పడిన ప్రధాన నిందితుడు శ్రీనివాసరావు పై ఇంకా విచారణ కొనసాగుతుంది,ఇప్పటికే పలు సంచలన ఆధారాలను వెలికి తీస్తున్న పోలీసులు విచారణను మరింత వేగవంతం చేశారు.అయితే గత కొద్ది రోజులు నుంచి అతన్ని విచారణ చేస్తున్న సంగతి తెలిసినదే.దాడికి పాల్పడిన సమయంలో బాగానే ఉన్నా శ్రీనివాసరావు, అతన్ని పోలీసుల అదుపులోకి తీసుకున్న తర్వాత బాగా నీరసించిపోయాడు.అయితే అతని యొక్క ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరచడానికి ఈ రోజు విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ ఆసుపత్రికి తీసుకురాగా అక్కడ వైద్యులు అతనికి చికిత్స చేశారు.

ఆ తర్వాత మళ్ళీ అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకువెళ్తుండగా అక్కడి ఆసుపత్రి ఆవరణలోని శ్రీనివాసరావు పెద్దగా కేకలు పెట్టడంతో ఒక్కసారే ఉద్రిక్తత చోటు చేసుకుంది.ఆ సమయంలో శ్రీనివాస్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు.”జగన్ పై తాను కావాలనే దాడి చేశానని,తన వెనుక ఎవరు లేరని,ఇక్కడ వీరు అంతా నన్ను చంపేసి రాజకీయం చెయ్యాలని చూస్తున్నారని నన్ను కాపాడండి” అంటూ ఆర్తనాదాలు చేసాడు.అంతలో మీడియాతో మాట్లాడనివ్వకుండా పోలీసులు వెంటనే అక్కడి నుంచి అతన్ని హుటాహుటిన తరలించేసారు.