గత వారం ఈ సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్ లో దుమ్ము దులిపేసాయ్..!

Thursday, November 29th, 2018, 04:55:56 PM IST

రోజురోజుకి మారుతున్న కాలంలో జనంలో బుల్లితెరకు ఒక ప్రత్యకమైన స్థానం ఏర్పడింది.మగవారు బయట వారి వృత్తిలో నిమగ్నం అయ్యి ఉంటే స్త్రీలు ఇంటి పట్టునే ఉన్నపుడు వారిని బయటకి కూడా కదలనీయనంతగా ఆయా ఛానెళ్లలో వచ్చే సీరియళ్లు ప్రభావితం చేస్తున్నాయి.వారికి నచ్చితే చాలు అది ఎన్ని వేల రోజులు గడిచినా వాటిని చూడడం మాత్రం ఆపరు. ఈ సీరియళ్ల ప్రభావం ఎంత గట్టిగా ఉంది అంటే ప్రతీ రోజు యూట్యూబ్ లో టాప్ 10 ట్రెండింగ్ లో ఒక సీరియల్ ఖచ్చితంగా ఉంటుంది.ఇప్పుడు తాజాగా కొన్ని సీరియళ్లు మాత్రం గత వారం టీఆర్పీ రేటింగ్స్ దుమ్ము దులిపినట్టు తెలుస్తుంది.టాప్ 3 లో ఉన్నటువంటి మూడు సీరియళ్లు ఒకే ఛానల్ కి సంబందించినవి కావడం విశేషం.

అవే “స్టార్ మా”(మా టీవీ) ఛానల్ లో ప్రసారమయ్యే “కార్తీక దీపం”, “కోయిలమ్మ” మరియు “లక్ష్మీ కళ్యాణం” సీరియళ్లు.ఇవి ఒక్కొక్కటి ఒక్కోక్క విభిన్న కథనంతో నడిచే ధారావాహికలు,అందులోను ఆసక్తికరంగా ఉండడంతో బుల్లితెర మీద ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.గత వారం రేటింగ్స్ లో సాయంత్రం 7గంటలకు ప్రసారామయ్యే “లక్ష్మీ కళ్యాణం” సీరియల్ కు గాను 11 టీఆర్పీ పాయింట్లు,అదే విధంగా 8 గంటలకు ప్రసారమయ్యే “కోయిలమ్మ” సీరియల్ కు 12 టీఆర్పీ పాయింట్లు మరియు ఈ రెండు సీరియళ్ల మధ్య 7:30 నిమిషాలకు ప్రసారమయ్యే “కార్తీక దీపం” సీరియల్ కు మాత్రం అత్యధికంగా 17 టీఆర్పీ పాయింట్లు సాధించి అగ్రస్థానంలో చోటు సంపాదించుకుంది.