వారిద్దరూ ప్రజాద్రోహులు : అందుకే వంచనపై గర్జన..!

Thursday, August 9th, 2018, 01:40:46 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ప్రధాన మంత్రి నరేంద్ర మోడి వల్లనే ప్రస్తుతం ఏపీ రాష్ట్రం ఎటువంటి అభివృద్ధికి నోచుకోకుండా పోయిందని వైసిపి నేతలు విమర్శిస్తున్నారు. నేడు గుంటూరులో తలపెట్టిన వంచనపై గర్జన దీక్షలో వైసిపి ప్రధాన నేతలైన మేకపాటి రాజమోహన్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, బొత్స సత్యనారాయణ సహా పలువురు వైసిపి నాయకులు చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. బాబు గతఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలకు దాదాపు 600 హామీలు ఇచ్చారని అందులో ఏవికూడా సక్రమంగా నెరవేర్చలేకపోయారని వైసిపి నేతలు విమర్శిస్తున్నారు. అంతే కాదు, రాష్ట్రాన్ని దోచుకుంటున్న బాబు ప్రభుత్వం కేంద్రం తమకు అన్యాయం చేసింది అంటూ ధర్మ పోరాట దీక్షలు చేయడం సిగ్గుచేటని, అసలు మొదట హోదా కావాలని,

ఆపై హోదా బదులు ప్రత్యేక ప్యాకెజీ చాలు అన్న చంద్రబాబు, రాష్ట్రానికి వచ్చిన నిధులన్నీ దిగమింగి, మళ్లి ఇప్పుడు హోదా కావాలనడం విడ్డూరంమని విమర్శించారు, వాస్తవానికి మొదటినుండి ఏపీకి ప్రత్యేక హోదా విషయమై నిజాయితీగా పోరాడుతోంది వైసిపి మాత్రమేనని అన్నారు. చంద్రబాబు రాజకీయజీవితం వంచనతో ప్రారంభం అయిందని, ఆయన రాజకీయ జీవితంలో ప్రజలకు చెప్పినదానిలో ఏఒక్క పని కూడా సక్రమంగా నెరవేర్చలేకపోయారని విమర్శించారు. ఒకప్రక్క రాష్ట్రంలో దాదాపుగా అన్నిరంగాలు నష్టాల బారిన పడుతుంటే బాబు మరియు ఆయన పార్టీ నేతలు మాత్రం ఎక్కడికక్కడ అందినంత దోచుకోవడానికి పధకం వేస్తున్నారని, నిజంగా ఇటువంటి ప్రభుత్వం దేశంలోనే ఎక్కడా లేదని అన్నారు. తాము చేస్తున్న ఈ వంచనపై దీక్షతో ప్రజలకు చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న మోసాలపై కనువిప్పు కలుగుతుందని, తప్పకుండ టిడిపి పార్టీకి రాబోయే ఎన్నికల్లో చాలా చోట్ల డిపాజిట్లు కూడా దక్కే పరిస్థితి కూడా ఉండబోదని వారు అంటున్నారు….

  •  
  •  
  •  
  •  

Comments