మేము దీక్ష చేస్తున్నా వారికి కనికరం లేదు!

Wednesday, July 11th, 2018, 10:12:50 PM IST


ఏపీ రాష్ట్రానికి గత ఎన్నికల్లో చెప్పినట్లు ఎన్డీయే నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం తాము ఇచ్చిన విభజన హామీలు మరియు ప్రత్యేక హోదా విషయమై పూర్తి అన్యాయం చేశాయని టిడిపి పార్టీ ఇటీవల నిరసన వ్యక్తం చేస్తూ, ఎన్డీయే నుండి బయటకి కూడా వచ్చింది. కాగా అప్పటినుండి ధర్మ పోరాట దీక్ష పేరుతో టీడీపీ నేతలు పలు చోట్ల దీక్షలు చేపట్టారు. నేడు అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాల మైదానమ్ లో నేటి ఉదయం నుండి టీడీపీ ఎంపీలు సాయంత్రం వరకు దీక్ష చేపట్టారు. మోడీ మేము దీక్ష చేస్తున్నప్పటికీ కనీసం కనికరం కూడా చూపకపోవడం దారుణమని ఎంపీలు అంటున్నారు. కేంద్ర వ్యతిరేక విధానాలను ఎండగట్టిన ఎంపీలు, పలువిధాలుగా బీజేపీ ప్రబుత్వాన్ని దుయ్యబట్టారు.

చంద్రబాబు ఎన్నిసార్లు మనకు నిధుల విషయమై ఢిల్లీ వెళ్లినప్పటికీ వారు మాత్రం సీరియస్ గా తీసుకోకుండా వదిలివేశారని, కేవలం అధికారం కోసమే గత ఎన్నికల్లో తమ మద్దతు కోరారని మండిపడ్డారు. ఏపీకి ఎంతో ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజక్టు విషయంలో కూడా నిధులు సంక్రమంగా ఇవ్వకుండా ఇబ్బంది పెడితే, సీఎం చంద్రబాబు ముందుండి నడిపించారని, అంతేకాక రాజధాని అమరావతి విషయంలో కూడా మనకు తీరని అన్యాయం చేసారని విమర్శించారు.కానీ తమ ప్రభుత్వం మాత్రం ఏపీకి జరిగిన అన్యాయం విషయమై వారికీ కనువిప్పు కలిగేవరకు దీక్షలు చేస్తూనే ఉంటామని వారు స్పష్టం చేసారు…..

  •  
  •  
  •  
  •  

Comments